రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది. గత ఐదారు మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు. శనివారం ఉదయం అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై అటవీశాఖ అధికారులని సంప్రదించగా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. పెద్ద ఎల్కిచర్ల పెద్దడవి 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గొర్ల కాపరులకు చిరుత మరణించిన విషయం తెలుసుకొని గ్రామంలో ఈ సమాచారాన్ని చెప్పారు. దీంతో సమాచారం అందుకున్న అటవి శాఖ సిబ్బంది ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. చిరుత పులి పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఆ తర్వాత మీడియాకు జరిగిన సంఘటనపై వివరాలు తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా క్రూరమృగాలు సంచరిస్తున్న ఈ అటవీ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అటవీశాఖ అధికారులు చిరుతపులులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Vizag MRO Incident: ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ
ఇదిలా ఉంటే.. పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గత వారం రోజుల క్రితం బయటికి వచ్చిన పెద్దపులి దెందులూరు వరకు సంచరించింది. ఆ తర్వాత పుల తిరుగు ప్రయాణంలో ఉన్నట్టుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు చోట్ల పశువులపై దాడి చేసి తినేసింది పెద్దపులి. దాని కదలికలను ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. పులి సంచారం తెలుసుకోవడానికి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.. పులికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తమకు వెంటనే చేరవేయాలని.. భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని ధైర్యం చెబుతున్నారు. అయితే, పంట పొలాల్లోకి వెళ్లే రైతులు.. పశువులను, గొర్రెలను పొలానికి తీసుకెళ్లేవారు.. పొలం పనులకు వెళ్లే కూలీలు, స్థానిక గ్రామాల ప్రజలు అంతా పులి భయంతో ఆందోళనకు గురిఅవుతున్నారు.