వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతున్న టీమిండియా రెండో టెస్టు రెండు రోజు ఆధిక్యంలో నిలిచింది. భారత్‌ను మొదటి సెషన్‌లోనే ఆలౌట్ చేసి ఆ తర్వాత విజృంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే ఆలౌటయ్యారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు ఆరు వికెట్ల (6/45)ను సమర్పించుకున్నారు. ఇదే కోవలో కుల్‌దీప్ యాదవ్ మూడు వికెట్లు (3/71) తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో.. 253 రన్స్‌కే ఇంగ్లండ్ ఆలౌట్ అవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లు ఆడి వికెట్లు ఏమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం ఓవరాల్‌గా 171 పరుగులకు చేరింది.
Vizag MRO Incident: ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ
బుమ్రా ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ (5), ఓల్లీ పోప్ (23), బెయిర్ స్టో (25), కెప్టెన్ బెన్ స్టోక్స్ (47), టామ్ హార్ట్ లే (21), జేమ్స్ ఆండర్సన్ (6) లకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా, తొలి టెస్టు సెంచరీ హీరో ఓల్లీ పోప్ ను బుమ్రా అవుట్ చేసిన యార్కర్ అద్భుతమనే చెప్పాలి. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. యువకెరటం యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ చేయడం రెండో రోజు తొలి సెషన్ లో హైలైట్ గా నిలిచింది.