పార్టీ ఫిరాయింపుల పై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడకొడతం అంటూ కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎలా కులుస్తావో మేము చూస్తాం, మేము ద్వారాలు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవడం ఖాయమని ఆయన వెల్లడించారు. మాతో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఫిరాయింపులు వద్దని మా హై కమాండ్ చెప్పడం వల్లే ఆగామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్…
ఖమ్మం పార్లమెంటు సీటు పై పలువురి కన్ను పడింది. కాంగ్రెస్ లోని ముఖ్యులు ఈసీటుకోసం ప్రయత్నాలు ప్రారంబించారు. ఇందులో బాగంగా పది మంది లిస్టును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించింది. మరో వైపున ఖమ్మం ఎంపి గా సీటు మల్లు నందినికి ఇవ్వాలని కోరుతు గాంధీ భవన్ లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అలా అందించిన వారు అంతా భట్టి వర్గీయులు .. అయితే…
భారత వాతావరణ విభాగం (IMD) ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమయ్యే ఉష్ణోగ్రతల పెరుగుదలను అంచనా వేసింది. ఇది హైదరాబాద్లో వేసవి ప్రారంభ ఆగమనాన్ని తెలియజేస్తుందని, నగరంపై శీతాకాలపు పట్టు సడలుతుందని సూచిస్తుంది. IMD-హైదరాబాద్లోని శాస్త్రవేత్త డాక్టర్ ఎ. శ్రావణి, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో సాధారణ స్థాయికి వచ్చే ముందు వచ్చే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, ఫిబ్రవరి మధ్యకాలం తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని భావిస్తున్నారు. చందానగర్లో బుధవారం అత్యధిక గరిష్ట…
త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ…
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జె్ట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో 2024 – 25 మధ్యంతర బడ్జెట్ పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2024 – 25 బడ్జెట్ లో ఆంధ్రపదేశ్ కు 9138 కోట్లు కేటాయింపు, 2024- 25 బడ్జెట్ లో తెలంగాణకు 5071 కోట్ల కేటాయింపు చేసినట్లు తెలిపారు. కాజీపెట్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని, ఎప్పుడు లేని…
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.…
సచివాలయంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం కాన్సుల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ కన్సులేట్ జనరల్ బెంగళూరు, థేయిరి బెర్తెలోట్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఏ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి ఫ్రాన్స్ కాన్సూల్ జెనరల్ బెర్తేలోట్ కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోతున్నా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. క్లస్టర్ల వారీగా ప్రతి రంగాన్ని అభివృద్ధి…
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. తొలుత గత ఏడాది…
హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ‘కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీతో స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఇది కలన లేక నిజమా అన్నటుందన్నారు. మళ్లీ హోటల్ పెడతామని అసలు అనుకోలేదని, కానీ ముఖ్యమంత్రి…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తామని ఆయన ప్రకటించారు.