మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం లో భాగంగా కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో కలిసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కి అడ్డా…పాలమూరు లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బండి సంజయ్. తెలంగాణ లో 10 కి పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని,…
సీఎం పదవి స్థాయి తగ్గించి పోకిరిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో రాజనీతిజ్ఞుడిగా మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, అబద్దపు పునాదులు, అలవికానీ హామీల మీద ఏర్పాటైంది ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వంలో విడుదల చేసిన రూ. 7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి…
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఒక దిగజారుడు పార్టీ. వెకిలి చేష్టలతో వికృతానందం పొందుతుందన్నారు. ఓడిన వాళ్లపై దుష్ప్రచారం చేయడం కుసంస్కారమన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగై పోయిందన్నారు. కాంగ్రెస్కు ఎందుకు ఓటేసామని రెండు నెలల్లోనే ప్రజలు బాధపడే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన…
వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు పడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. ఇవాళ ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా చర్యలు .. ప్రపంచంలోనే ఇండియాను 3వ స్థానానికి తీసుకెళ్లడానికి నిరంతర కృషి చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తుందని, దేశ ప్రజలంతా మోడీ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశంలో రాబోయేది.. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అవినీతి…
రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని, ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీ దక్షిణ భారత ను విభజించాలని మాట్లాడుతున్నాడని, నారీ శక్తి కి ప్రోత్సాహించేలా ప్రసంగం ఉందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. మోడీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రసంశలను తట్టుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ యాత్ర భారత్ జోడో చేస్తుంటే…
జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ ఫంక్షన్ హాల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కొరకై స్థానిక ప్రజలకు చేరడం కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. పార్టీలో ప్రాధాన్యత అందరికీ ఉంటుందని, ప్రజా పాలన నచ్చి కౌన్సిలర్ల, సర్పంచులు చేరారని ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఉంటాయని, రానున్న ఎంపీ, సర్పంచ్,…
KRMB కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సర్కార్కు లొంగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేసీఆరే చెప్పారని, కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి…
రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసి విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బషీర్బాగ్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూకేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేయేశ్ రంజన్, సంస్థ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సంస్థ అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన భూకేటాయింపులు, తర్వాత జరిగిన కేటాయింపుల పై…
వికారాబాద్ జిల్లా… చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పరిగి అసెంబీ కాన్సిస్టుయెన్సీ పూడురు మండలం దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని… దాన్ని వేరే దగ్గరికి మార్చాలని బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మించడం వల్ల 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం…
భద్రాచలంలో బిఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేవేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పినపాకలో దురదృష్టవశాత్తు ఓడిపోయామన్నారు. ఉత్సాహం నింపుదామని వస్తే మీరే ఉత్సవానికి నాకు నింపారన్నారు. ఎమ్మెల్యేలు పోయిన ఎంపీ నామా నాగేశ్వరరావు అద్భుతంగా గెలిచారన్నారు. రెండుసార్లు ఎంపీని గెలిచాం మూడోసారి ముచ్చటగా ఎంపీని గెలిపించుకుందామని, ప్రజలు చర్చ మొదలైంది మార్పు తెస్తామన్నారు. కరెంటు కోతలు నాడు లేవ్…