భద్రాచలంలో బిఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేవేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పినపాకలో దురదృష్టవశాత్తు ఓడిపోయామన్నారు. ఉత్సాహం నింపుదామని వస్తే మీరే ఉత్సవానికి నాకు నింపారన్నారు. ఎమ్మెల్యేలు పోయిన ఎంపీ నామా నాగేశ్వరరావు అద్భుతంగా గెలిచారన్నారు. రెండుసార్లు ఎంపీని గెలిచాం మూడోసారి ముచ్చటగా ఎంపీని గెలిపించుకుందామని, ప్రజలు చర్చ మొదలైంది మార్పు తెస్తామన్నారు. కరెంటు కోతలు నాడు లేవ్ ఇప్పుడు ట్రిప్పులతో కోతలు మొదలయ్యాయన్నారు. ఉచిత బస్సులు పెట్టి 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డున పడేసే మార్పును కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు హరీష్ రావు. ఆటో కార్మికులకు నెలకు పదివేలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించి ఆదుకోవాలని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కళ్ళు నెత్తికి ఎక్కేయి అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క జిల్లాలో ఉన్న పెన్షన్ మాత్రం రాలేదన్నారు.
జడ్పీ చైర్మన్ రైతుబంధు డబ్బులు పడట్లేదు అని ప్రశ్నిస్తే పోలీసులతో గెంటించి చెప్పుతో కొట్టండి అని ఓ మంత్రి మాట్లాడాడని, సీఎం కేసీఆర్ ఏ భూములకు రైతుబంధు రావడం లేదన్నారు హరీష్ రావు. నాటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు సదువుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేక పోతుందన్నారు. రెండు నెలలు గడవక ముందే ప్రాజెక్టును ఢిల్లీకి అప్పగించిన ఘనత కాంగ్రెస్ సాధించిందని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వంద రోజుల్లో గట్టిగానే ఎదుర్కొంటామన్నారు హరీష్ రావు. అంతకుముందు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట రాజ్యసభ ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.