వికారాబాద్ జిల్లా… చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పరిగి అసెంబీ కాన్సిస్టుయెన్సీ పూడురు మండలం దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని… దాన్ని వేరే దగ్గరికి మార్చాలని బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మించడం వల్ల 400 సంవత్సరాల పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం, విలువైన అటవీ, ఔషధ వృక్షాలు కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉందన్నారు.
Prabhas: దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. ప్రభాస్ ఇంటికెళ్ళి ఆహ్వానం
దాంతోపాటు, ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు అయ్యాక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయని స్పష్టం చేశారు. పూడురు మండల ప్రజానీకం నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ రూల్ 377 కింద లోక్సభలో ప్రత్యేకంగా రంజిత్ రెడ్డి లేవనెత్తారు. స్థానిక ప్రజలు ఆందోళనలను పరిశీలించి… కేంద్ర రక్షణ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచన చేశారు. నేవీ రాడార్ స్టేషన్ను అక్కడి నుంచి మార్చి వేరే అనువైన ప్రదేశాలని మార్చాలని కోరారు. ఈ విషయంపై స్థానిక ప్రజలు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
Ashok Gehlot: మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కి కోవిడ్, స్వైన్ ఫ్లూ.. ఆస్పత్రిలో చేరిక..