Minister Lokesh: పంజాబ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అందరి సుఖశాంతి, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించానని.. స్వర్ణ దేవాలయ సందర్శన మహా భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. ఈ రోజు ఉదయం అమృత్‌సర్‌కు చేరుకున్న లోకేష్ కుటుంబం, అత్యంత పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా సీఎంను సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ.. ‘‘ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు’’ అంటూ నవ్వులు పూయించారు. తనకు అది ‘గీత’తో సమానమంటూ ‘అన్‌స్టాపబుల్’ పుస్తకంపై చంద్రబాబుతో…
విజయవాడ పున్నమి ఘాట్లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. ఆమెతో పాటు.. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు అనిత, సవిత, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారాయణస్వామి బుద్ధి, జ్ఞానం లేకుండా మతిలేని వాడిలా మాట్లాడాడు అని మాజీ మంత్రి నన్నపనేని రాజ కుమారి విమర్శలు చేశారు. ఆయనతో ఎవరు మాట్లాడించారో ప్రజలకు తెలుసు.. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి అనరాని మాటలనేవారు అసలు మనుషులేనా అన్న సందేహం కలుగుతోంది.
Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి అభిమానులను అలరించబోతున్నాడు. అఖండ వంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదలవుతోంది. ఇటీవల ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడం…