ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారాయణస్వామి బుద్ధి, జ్ఞానం లేకుండా మతిలేని వాడిలా మాట్లాడాడు అని మాజీ మంత్రి నన్నపనేని రాజ కుమారి విమర్శలు చేశారు. ఆయనతో ఎవరు మాట్లాడించారో ప్రజలకు తెలుసు.. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి అనరాని మాటలనేవారు అసలు మనుషులేనా అన్న సందేహం కలుగుతోంది.. స్వర్గీయ ఎన్టీఆర్ మరణించింది 1996లో అయితే, చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిల వివాహం జరిగింది 1981లో అని ఆమె పేర్కొన్నారు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండానే నారాయణ స్వామి మతి లేకుండా మాట్లాడారా? అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారిని తమ పార్టీలో చేర్చుకొని ఆయన కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని ఎవరు తిట్టిస్తున్నారో నారాయణస్వామికి తెలియదా? అని నన్నపనేని రాజకుమారి అన్నారు.
Read Also: Pakistan Team: ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్..!
పవిత్రమైన దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ అసభ్యంగా మాట్లాడి అపవిత్రుడయ్యాడు అంటూ నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సరిగ్గా మాట్లాడితే మంత్రులు సభ్యతతో మాట్లాడతారు.. నాయకుడి బాటలోనే అనుచరులు నడుస్తూ, ఆడబిడ్డలను అవహేళన చేసే నీచస్థితికి దిగజారారు.. చంద్రబాబుకి మద్ధతుగా రోడ్లపైకి వచ్చే వారిని ప్రభుత్వమే అడ్డుకుంటూ మరోపక్క ఎవరూ బయటకు రావడంలేదని దుష్ప్రచారం చేస్తోంది అని ఆమె ఆరోపించారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను చూసి ఈ ప్రభుత్వం భయపడుతోంది.. చంద్రబాబుకి మద్ధతుగా వారు పిలుపునిచ్చిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావడంతో పాలకుల్లో భయం మొదలైంది అంటూ మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు.