Unstoppable Season 4: అమరావతిలో తోడు ఎవరూ లేరు.. మేం కూర్చుని మాట్లాడుకుంటే అదే పండుగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా సీఎంను సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ.. ‘‘ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు’’ అంటూ నవ్వులు పూయించారు. తనకు అది ‘గీత’తో సమానమంటూ ‘అన్‌స్టాపబుల్’ పుస్తకంపై చంద్రబాబుతో సరదాగా ప్రమాణం చేయించారు. ఇక ఆ తర్వాత కొన్ని ఫోటోలను చూపించి రెండిట్లో ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలో మీరే చెప్పాలంటూ చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ముందుగా కాఫీ ఆ టీ ఆ అని అడిగితే ఉదయాన్నే ఒక కాఫీ తీసుకుంటానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Double Ismart: టీవీలోకి డబుల్ ఇస్మార్ట్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
హైదరాబాదులో ఉంటే భువనేశ్వరితో కలిసి కాఫీ తాగుతానని ఆయన అన్నారు. అదే అమరావతిలో ఉంటే తోడు ఎవరూ లేరు కాబట్టి ఆ డైనింగ్ టేబుల్ తనకు తోడని చెప్పుకొచ్చారు. మా చెల్లెలు మీతో కలిసి కాఫీ తాగి పుష్కరం దాటింది అని చెప్పింది అంటే నిజానికి మా ఇద్దరికి ఏమాత్రం సమయం దొరికినా కూర్చుని మాట్లాడుకుంటాం, మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడమే మాకు పెద్ద పండుగలా ఉంటుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి ఫోటోలు ప్లే చేసి ఇద్దరిలో ఎవరు బాస్ అని అడిగితే నాకు భువనేశ్వరి బాస్ మా అబ్బాయికి బ్రాహ్మణి బాస్ అని చెప్పుకొచ్చారు. మేము తట్టుకోలేకే మీ ఇంటికి పంపించేసామని బాలకృష్ణ అంటే వాళ్ళిద్దరూ చాలా డెడికేటెడ్ అని చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరూ చాలా క్రమశిక్షణతో ఉంటారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!