టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు వైఎస్ఆర్సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానం లభించింది. ఈ వేడుకకు హాజరైన చిరు, విష్ణు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. చిరంజీవి వేదికపై ప్రజలతో మమేకమవడం చూసి పలువురు మెగాస్టార్తో సెల్ఫీలు దిగారు. అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుతో పాటు వైఎస్సార్సీపీ నేతలు హాజరై వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు బొత్స కుమారుడి నిశ్చితార్థానికి చిరంజీవి హాజరైన విజువల్స్…
టీడీపీ సీనియర్ నేత… గోరంట్ల బుచ్చ చౌదరికి బొత్స సత్య నారాయణ సవాల్ విసిరారు. తాను అబద్దాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి అంటున్నారని… ధైర్యం ఉంటే చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఎవరి వాదం ఏంటో చెబుదామని… రా…ఇద్దరం రాజీనామా చేద్దామని పేర్కొన్నారు బొత్స సత్య నారాయణ. ఇంత వయసు ఉండి అర్ధం లేకుండా మాట్లాడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురువింద గింజలాంటి వ్యక్తి అని.. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని…
ప్రజల కోసం మంచి పథకం తీసుకుని వేస్తే టీడీపీ విమర్శలు చేస్తోంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇళ్ళ పట్టాలపై కూడా టీడీపీ ఇలానే అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ నిన్న కోర్టు తీర్పుతో అందరికీ స్పష్టత వచ్చింది అని మంత్రి బొత్స తెలిపారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగిందే అని చెప్పిన ఆయన… ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దదు అని చెప్పారు. స్వచ్ఛందంగా…
ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమయిన అన్యాయం జరగకుండా చూస్తామని, పీఆర్సీ విషయంలో కాస్త ఓపికతో వుండాలన్నారు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామన్నారు మంత్రి బొత్స. ఐ.ఆర్. సైతం ప్రకటించామని తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ఈ…
అనంతపురం వచ్చిన వరదలపై సమీక్షలో పంట నష్టాలపై చర్చ చర్చించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అందులో జిల్లాలో 50 శాతానికి పైగా పప్పు శనగ పంట నష్టం వాటిల్లిందని అధికారుల వివరణ ఇచ్చారు. అధికారుల లెక్కలపై పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ క్రాప్ నమోదు కాకపోవడం పై కేశవ్ మండిపడ్డారు. పప్పుశనగ సహా పాడైన పంట లను వెంటనే ఈ క్రాప్ నమోదు చేయండి. అధికారులు పంట లు వేసినవే 50 శాతం తగ్గించారు.…
అమరావతి రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని… ఎవరికో భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు బొత్స. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభ లో స్పష్టంగా ప్రకటన చేశారని… అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్నారు. అపోహలు, అభిప్రాయ బేధాలతోనే అమలు్లో ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లును తీసుకు వస్తామని… మూడు ప్రాంతాల అభివృద్ధి టకి మళ్ళీ…
తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది…
మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ విజయనగరం జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.. వైసీపీలో బొత్స పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాన్ని చిటికెలో కొల్పోయిన వ్యక్తి బొత్స.. అలాంటి గొప్ప నేత బొత్సకు కనీసం హోం మంత్రో.. పరిశ్రమల మంత్రో.. ఆర్థిక మంత్రో అవుతారు అనుకున్నా… కానీ, చివరికి మున్సిపల్…
క్రెడాయ్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ గడువును పొడిగించాలని క్రెడాయ్ ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. టీడీఆర్ బాండ్ల జారీ.. వాటి కాల పరిమితి.. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఎల్ఆర్ఎస్ అమలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, ఆన్ లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను క్రెడాయ్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వీటిపై స్పందించిన…