రెండున్నరేళ్ళ తర్వాత కేబినెట్ మారుస్తానని చెప్సిన జగన్ గ్రేస్ పీరియడ్ పెంచి మరో ఆరునెలల తర్వాత కేబినెట్ మార్చారు. అందులోనూ సగం మందిని వుంచేశారు. ఏపీలో కేబినెట్ కూర్పు పూర్తైంది.. శాఖల కేటాయింపు కంప్లీట్ అయింది. చాలా మంది మంత్రులు తమకు అప్పగించిన శాఖలకు సంబంధించి బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. తమకు అప్పగించిన శాఖలు నచ్చక..…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మరోసారి చోటు దక్కించుకున్నారు సీనియర్ పొలిటీషన్, మంత్రి బొత్స సత్యనారాయణ.. కేబినెట్లో తిరిగి చోటు సంపాదించుకున్న 10 మంది మంత్రుల్లో ఆయన ఒకరు కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.. కేబినెట్ కూర్పుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన బొత్స.. మంత్రివర్గం కూర్పు అద్భుతం అన్నారు.. జనాభాలో ఎక్కువగా ఉన్న వారికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. మేం భాగస్వాములవ్వాలన్న బీసీల కోరిక సీఎం జగన్ నెరవేర్చారని ప్రశంసలు కురిపించారు. Read Also: RK Roja:…
ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేయడంతో కొత్త కేబినెట్లో ఎవరు ఉంటారన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కేబినెట్లో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని సాగనంపాలి అనేది సీఎం జగన్ ఇష్టమని, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మంది కేబినెట్లో తాను ఉంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీని…
ఏపీకి మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని.. ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని బొత్స కామెంట్ చేశారు. దమ్ముంటే టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరమని చెప్పాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీడీపీ వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేయమని చెప్పాలన్నారు. రాజధాని పరిధిలో మిగిలిన 7,300…
ఏపీలో మూడురాజధానులకు కట్టుబడి వున్నామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులు అనేవి మా పార్టీ, ప్రభుత్వ విధానం. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. సమయాన్ని బట్టి సభలో బిల్లు పెడతాం. మూడు రాజధానుల విధానమే మా నిర్ణయం అన్నారు. మొదటి నుండి అదే చెప్తున్నాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం అని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? ఏదైనా పాజిటివ్ గా…
ఏపీలో సంచలనం కలిగించిన తణుకు టీడీఆర్ బాండ్ల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ స్కాం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్నారు. తణుకు టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారన్నారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పది రోజుల క్రితమే నాకు ఫిర్యాదు చేశారు. కారుమూరిపై టీడీపీ ఆరోపణలు…
Andhra Pradesh CM Jagan Fired on TDP MLA’s at Assembly Meetings Today. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు స్పీకర్ రద్దు చేశారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సహజ మరణాలకు కూడా టీడీపీ వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు…
ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స మరోసారి స్పందించారు. 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్ అని ఆయన వ్యాఖ్యానించగా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పొడుగు కావడం కాదు.. కొంచెం బుర్ర పెరగాలి అంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేస్తారు కానీ తాము హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మాత్రం టీడీపీ…
సీఆర్డీఏ చట్టం, మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.. అయితే, హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్… హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలి? సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా? వద్దా? అనే విషయాలపై సమాలోచనలు చేశారు.. అయితే, ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేవారు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లాలా..? లేదా..? అని ఆలోచన చేస్తామన్న ఆయన.. అయినా…
ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష…