ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ అంశంపై ఒక నిర్ణయానికి రానుంది ప్రభుత్వం. సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో పది గంటలకు ముఖ్యమంత్రితో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. నిన్న స్టీరింగ్ కమిటీ లో జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనుంది మంత్రుల కమిటీ.
హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబులు, సీసీఏ రద్దు, మట్టి ఖర్చులు అంశాలపై ఖజానా పై పడే ఆర్ధికభారం, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను సీఎం కు వివరించనున్నారు మంత్రుల కమిటీ సభ్యులు. ఆర్ధికపరమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనుంది సీఎం జగన్. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ. చర్చలకు సంబంధించి స్పష్టత ఇంకా రాకపోవడంతో నిరసన కొనసాగుతుందని చెబుతున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు.