టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు వైఎస్‌ఆర్‌సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానం లభించింది. ఈ వేడుకకు హాజరైన చిరు, విష్ణు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. చిరంజీవి వేదికపై ప్రజలతో మమేకమవడం చూసి పలువురు మెగాస్టార్‌తో సెల్ఫీలు దిగారు. అలాగే ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు హాజరై వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు బొత్స కుమారుడి నిశ్చితార్థానికి చిరంజీవి హాజరైన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : కష్టాల్లో కపిల్ దేవ్ బయోపిక్ … కేసు నమోదు
ప్రస్తుతం చిరంజీవి “ఆచార్య” సినిమాతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకులను థియేటర్లలో పలకరించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో పాటు కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.