ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి చోటు దక్కించుకున్నారు సీనియర్ పొలిటీషన్, మంత్రి బొత్స సత్యనారాయణ.. కేబినెట్‌లో తిరిగి చోటు సంపాదించుకున్న 10 మంది మంత్రుల్లో ఆయన ఒకరు కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.. కేబినెట్ కూర్పుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన బొత్స.. మంత్రివర్గం కూర్పు అద్భుతం అన్నారు.. జనాభాలో ఎక్కువగా ఉన్న వారికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. మేం భాగస్వాములవ్వాలన్న బీసీల కోరిక సీఎం జగన్ నెరవేర్చారని ప్రశంసలు కురిపించారు.
Read Also: RK Roja: హోంమంత్రి రోజా అంటూ ప్రచారం.. ఫైర్ బ్రాండ్ స్పందన ఇది..
ఇది ఎన్నికల కేబినెట్ అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్న ఆయన.. అసంతృప్తితో ఉన్నవారిని కలుపుకుని ముందుకెళ్తాం.. మేమందరం ఒకటేనని స్పష్టం చేశారు. కేబినెట్‌పై తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదని.. ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తూ.. ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు ముందుకు సాగుతామన్నారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..