Tension in Rajayyapeta: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన నేటికి 39వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ సంఘీభావం తెలపనుంది. కాసేపట్లో వైసీపీ ముఖ్య నేతలు ఛలో రాజయ్యపేటకు తరలి వెళ్లనున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేక పోరాటానికి మద్దతు పెరుగుతుంది. చుట్టూ పక్కల 9 గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు.
Read Also: Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా
ఇక, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దిగి రావాల్సిందేనని 9 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజయ్య పేట గ్రామస్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నేతలు వెళ్తున్నారు. రాజయ్య పేట వెళ్లేందుకు వైసీపీ నేతలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. అలాగే, రాజయ్య పేటలో పోలీసుల పహారా కొనసాగుతుంది. పెట్టిన ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.