దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ప్రికాషనరీ డోస్ కింద వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. మొదటి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో, మూడో డోస్ కింద అదే వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. మొదటగా 60 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, హెల్త్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 5.75 కోట్ల మంది మూడో డోస్ వ్యాక్సిన్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇందులో 2.75 కోట్ల మంది 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఉండగా, కోటి మంది హెల్త్ వర్కర్లు, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లు ఉన్నారు. మూడో డోస్ వ్యాక్సినేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లు అవసరం లేదని, డైరెక్టుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.
Read: లైవ్: బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసులు ఇచ్చే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు మూడో డోసు తీసుకోవాలని కేంద్రం తెలియజేసింది. రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాత మూడో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసుగా ఏ వ్యాక్సిన్‌ను తీసుకున్నారో, మూడో డోసు కింద అదే వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ పెరగడంతో డిసెంబర్ 25 వ తేదీన ప్రధాని మోడీ బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకున్నారు.