భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, థర్డ్ వేవ్ ముప్పు పొంచియున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జనవరి 10 వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, బూస్టర్ డోసులుగా ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వబోతున్నారు అన్నదానిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మక్సింగ్, మ్యాచింగ్ పద్ధతిలో డోస్ ఉంటుందా లేదంటే గతంలో ఇచ్చిన కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రికాషన్ డోస్‌గా ఇస్తారా అన్నది చూడాలి. ఒకవేళ కోవీషీల్డ్ లేదా కోవాగ్జిన్‌ను ప్రికాషన్ డోస్‌గా ఇస్తే తప్పని సరిగా మూడో డోస్‌కు 9 నుంచి 12 నెలల గ్యాప్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. రెండు వ్యాక్సిన్ల మధ్య విరామం కూడా అదేవిధంగా ఉండటంతో మూడో డోసు అదేవిధంగా ఉండే అవకాశం ఉంది. బూస్టర్ డోస్ కింద ఏమి ఇవ్వబోతున్నారు అనే విషయాలపై త్వరలోనే అవగాహన వచ్చే అవకాశం ఉంది.