దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు ఆరు నెలల తరువాత కొవాగ్జిన్ బూస్టర్ డోసు వేయించుకుంటే కరోనా నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఫలితం వెల్లడైందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని స్పష్టం చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌తో నిర్వహించిన బూస్టర్ డోస్ ఫేజ్-2 ప్రయోగ ఫలితాలను భారత్ బయోటెక్ వెల్లడించింది.
Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు
కొవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్న వాలంటీర్లకు ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వగా వారిలో యాంటీబాడీలు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నాయని వివరించింది. బూస్టర్ డోసుతో యాంటీబాడీల సంఖ్య 19 నుంచి 265 రెట్లు పెరిగిందని తెలిపింది. బూస్టర్ డోసు తీసుకున్న 90శాతం మందిలో కరోనా వైరస్ ఆల్ఫా, బీటీ, డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను నివారించే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. బూస్టర్ డోస్ కారణంగా రక్తంలో బీ, టీ సెల్స్ పెరుగుదలను సైతం గుర్తించినట్లు పేర్కొంది.