యూఎస్‌లో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. ఇప్పటికే రెండో డోసుల వ్యాక్సిన్, మూడో డోసు కింద బూస్టర్ డోస్ లను అందిస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్ వేవ్‌ల సమయంలో యూఎస్‌లో కేసులు భారీగా నమోదయ్యాయి. కేసులతో పాటు పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. బూస్టర్ డోసు తీసుకున్నప్పటికీ కేసులు పెరగడం, వ్యాక్సిన్‌లను తట్టుకొని వైరస్ మహమ్మారి దాడులు చేస్తుండటంతో నాలుగో డోస్ కింద మరోసారి బూస్టర్ డోసులు ఇచ్చేందుకు యూఎస్ రంగం సిద్దం చేసుకుంటోంది. దీనిపై అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల వ్యక్తిగత వయస్సు, ఆరోగ్యసమస్యల ఆధారంగా నాలుగో డోసు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు డాక్టర్ ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు.
Read: Dangerous: వర్మ లెస్బియన్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!
ఒమిక్రాన్ ను ఆందోళనకర మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించిన తరువాత యూఎస్‌లో కరోనాతో సుమారు లక్ష మందికి పైగా ప్రజలు మృత్యువాత పట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కారణంగా సుమారు 5 లక్షల మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండటంతో యూఎస్‌లో నిబంధనలను సడలిస్తున్నారు. మాస్క్ విషయంలో సీడీసీ సలహాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని డాక్టర్ ఫౌచీ తెలిపారు.