ఉపాధిహామీ పథకం.. తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయి ? అని ప్రశ్నించారు. బిల్లులు ఎత్తుకున్నారు ? చట్ట వ్యతిరేకంగా వాడారు ? కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తన కోరిక మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల చేయడానికి కేంద్రం ఒప్పుకుంటే.. టీఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే వచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ తరుపున ప్రచారానికి వెళ్లిన బూర నర్సయ్య గౌడ్ ను టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది.
ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.
టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్‌కు నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. మీపై అభిమానంతో కృతజ్ఞతగా ఇప్పటివరకు పార్టీలో ఉన్నానని స్పష్టంచేశారు. అభిమానం, బానిసత్వానికి చాలా తేడా ఉందని లేఖలో పేర్కొన్నారు.