Booranarsaiah letter to CM: టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్‌కు నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. టీఆర్ఎస్ కీలకంగా భావిస్తున్న మునుగోడు బైపోల్ సమయంలో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన, నిన్న ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు.. బీజేపీలో చేరడానికే ఢిల్లీ వెళ్లారు. లేఖలో ఏముందంటే.. మునుగోడు అభ్యర్థి ఎంపికలో నన్ను సంప్రదించలేదున్నారు. ఆత్మగౌరవ సభలలో ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదన్నారు. మునుగోడు టిక్కట్ అసలు నాకు సమస్యనే కాదన్నారు బూర నర్సయ్య గౌడ్. బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్ పరిశీలించాలని అడగటం నేరమా? అంటూ ప్రశ్నించారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మీపై అభిమానంతో కృతజ్ఞతగా ఇప్పటివరకు పార్టీలో ఉన్నానని స్పష్టంచేశారు. అభిమానం, బానిసత్వానికి చాలా తేడా ఉందని లేఖలో పేర్కొన్నారు.
Read also: Pakistan: పాకిస్తాన్‌లో షాకింగ్.. ఆస్పత్రి పైకప్పుపై 200 కుళ్లిపోయిన శవాలు
2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన.. 2019ల్లో మరోసారి పోటీ చేసినా.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఆయన పేరు తెరపైకి వచ్చింది.. మునుగోడు టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించారు బూర నర్సయ్యగౌడ్.. కానీ, ఆయనకు నిరాశ తప్పలేదు.. ప్రగతి భవన్‌కు పిలిపుంచుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్… బీఆర్‌ఎస్‌లో మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పినట్టుగా.. ఆ తర్వాత మీడియాకు బూర నర్సయ్య గౌడ్ చెప్పిన విషయం తెలిసిందే.. అంతేకాదు.. అధినేత కేసీఆర్ మాటకు కట్టుబడి ఉంటామని.. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు. కానీ, కారు పార్టీకి షాక్ ఇచ్చారు బూర.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి తరుణ్ చుగ్‌ను భేటీ అయ్యారు బూర నర్సయ్య గౌడ్. ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు సమాచారం. అక్కడే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఇతర పార్టీలో కీలకంగా ఉన్న నేతలను, మాజీ ప్రజాప్రతినిధులను.. అసంతృప్తితో ఉన్నవారిని లాగే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.