రేవంత్ రెడ్డి డిమాలిషన్ మాన్, ఇపుడు డైవర్షన్ మాన్ అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజుపై రేవంత్ ఎన్నో మాట్లాడారు.. ఇపుడు ఏమీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ హై కమాండ్స్ ఎప్పుడో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలకి కాకుండా బీజేపీకి ఓటు వేయాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.
“సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య…
Boora Narsaiah Goud : కాంగ్రెస్ నాయకత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని చూస్తుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తొస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ జెలెన్స్కీ లాంటివారిగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో తీపి కబురుతో…
Boora Narsaiah Goud: తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు బూర నర్సయ్య. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు.. సర్కార్ దీనికే పరిమితమైందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి…
భువనగిరి ఎంపి ఎన్నికలలో బిజేపి 32 శాతం ఓట్లు తెచ్చుకుందని, పార్లమెంట్ ఎన్నికలలో బిజేపి గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని అసత్యప్రచారాలతో ప్రజలను నమ్మించారన్నారు మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన జనగామ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచి మంత్రులు పర్యటన పేరుతో కాలయాపన చేస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు.…
Boora Narsaiah Goud on Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. 75 శాతం బీసీలను మమత వెన్ను పోటు పొడిచారని, కాంగ్రెస్‌లో ఉన్న హిందువులంధరు ఆమెపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్థాయన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ గాంధీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, మహమ్మద్…
రేవంత్ రెడ్డి రుణమాఫీకి ఆగస్టు 15 అంటూ జనాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది..ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది..
తెలంగాణలో 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలపై వారికే గ్యారంటీ లేదు అని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై, మోసపూరిత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ శ్రేణులపై దాడులకు, లాఠీచార్జ్ లకు పాల్పడుతూ అణచివేయాలని చూస్తోంది అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను అణచివేయాలని చూడటం దుర్మార్గ చర్యే అని ఆయన వ్యాఖ్యనించారు.