Munugode by poll: బూర నర్సయ్య గౌడ్ కు నిరసన సెగ.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode by poll: తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతోంది. రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. పార్టీనేతలంతా మునుగోడులో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. ఇటీవలె టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో వెళ్లిన బూరనర్సయ్య గౌడ్ కు నిరసన సెగ ఎదురైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో బీజేపీ తరుపున ప్రచారానికి వెళ్లిన బూర నర్సయ్య గౌడ్ ను టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బూరనర్సయ్య గౌడ్ డౌన్ డౌన్ అంటూ టీఆర్ ఎస్ నేతలు నినాదాలు చేశారు. దీంతో.. చౌటుప్పల్ మండలం జే.కేసర్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులో తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు.
Read also: China On Taiwan: తైవాన్ విషయంలో చైనా కీలక చర్య.. స్వాతంత్య్రం ఇక కష్టమే..
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఈనెల 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో బూరనర్సయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న విషయం తెలిసిందే.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో తనను పార్టీ సంప్రదించలేదని బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తితో వున్నారు. టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చారు బూర నర్సయ్యగౌడ్. తనకు పార్టీలో అవమానం జరిగిందని, తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదంటూ అందుకే రాజీనామా చేసినట్లు బూర నర్సయ్య గౌడ్ వివరించారు.
Salman Khan: సల్మాన్ ఖాన్ కు డెంగ్యూ.. జయం రవికి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!