Bombay High Court: 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టైన మహారాష్ట్ర వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక సంబంధం ప్రేమ వ్యవహారంతో జరిగిందని, అది కామం వల్ల కాదని కోర్టు అభిప్రాయపడింది. బాలిక మైనర్ అని.. అయితే ఆమె తన ఇష్టంతోనే ఇంటిని వదిలేసి నిందితుడు నితిన్ ధబేరావ్‌తో కలిసి వెళ్లిందని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పినట్లు జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే గమనించారు.
Read Also: HanuMan North Response: ‘నార్త్’లో రచ్చ రేపుతున్న హనుమాన్.. రికార్డ్ బ్రేక్?
26 ఏళ్ల నిందితుడు, 13 ఏళ్ల బాలిక మధ్య ప్రేమ వ్యవహారంతోనే వీరద్దరు కలిసి ఉన్నట్లు జస్టిస్ జోషి-ఫాల్కే తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లైంగిక సంబంధం ఆరోపణలో ఇద్దరి మధ్య ఆకర్షణ బయటపడిందని, నిందితుడు బాలికను కామంతో లైంగిక వేధింపులకు గురిచేసిన సందర్భం లేవని కోర్టు వెల్లడించింది.
ఆగస్టు 2020లో బాలిక తండ్రి మిస్సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. తన 13 ఏళ్ల కుమార్తె పుస్తకాలు తీసుకువస్తాననే సాకుతో ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, ఆమె తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక ఆచూకీ తెలుసుకుని విచారించిన తర్వాత.. ఈ కేసులో బాలిక తన ఇష్టపూర్వకంగానే ఇళ్లు వదిలి వెళ్లినట్లు పోలీసులకు చెప్పింది. నిందితుడు తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని అందుకే ఇంట్లోని ఆభరణాలు, నగదుతో దభేరావుతో వద్దకు వెళ్లినట్లు పోలీసులకు బాలిక తెలిపింది.