పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ముగ్గురు సభ్యులతో సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మరణించారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఇవాళ పోలియో టీకాలు వేసే కార్మికులకు భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Mahabubabad Stone Crusher Bomb Blast: మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. బుధవారం అర్ధరాత్రి స్టోన్ క్రషర్‌లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్‌కు పక్కనే ఉన్న గ్రామంలోని ఇళ్ల గోడలకు బీటలు వారాయి. బాంబు పేలుళ్లకు భయంతో జనాలు ఇల్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆపై అదే రాత్రి స్టోన్ క్రషర్ వద్ద గ్రామస్తుల ఆందోళనకు దిగారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రకారం క్రషర్ స్టోన్ ఉందని యాజమాన్యం చెబుతోంది. గూడూరు మండలం పొనుగోడు గ్రామ…
మహబూబాబాద్ జిల్లా పొనుగోడులోని స్టోన్స్ క్రస్సర్లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ చేశారు. దీంతో.. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులోని రేణుక స్టోన్స్ క్రస్సర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ తో తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రస్సర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు అడ్డగించారు. బాంబు పేలుళ్ళకు ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి గ్రామస్తులు రోడ్లపైకి పరుగులు తీశారు. అంతేకాకుండా.. భారీ పేలుళ్ళకు ఇళ్ల గోడలకు బీటలు, ప్రమాదకరంగా నెర్రలు పడ్డాయని ఆరోపిస్తున్నారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబూల్ నగరంలో బస్సులో పేలుడు సంభవించింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘాన్‌లో మైనారిటీ షియా హాజరా కమ్యూనిటీలు ఎక్కువగా ఉండే దష్ట్-ఎ-బర్చి పరిసరాల్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారి ఖలీద్ జద్రాన్ తెలిపారు.
అసెంబ్లీ పోలింగ్ కు ముందురోజు ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో బాంబు పేలుడు ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలయ్యాయి.
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
At least 34 Killed in Balochistan Bomb Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 34 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించిందని జియో న్యూస్ పేర్కొంది. ఈ ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్…
Pakistan: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు ధాటికి 8 మంది మరణించారు. రాకెట్ లాంచర్ మందుగుండుతో పిల్లలు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. సింధ్ ప్రావిన్సులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన 8 మందిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
Pakistan Blast: పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఆదివారం (జూలై 30) భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని బజౌర్ లో జరిగిన ఈ బాంబు పేలుడులో 40 మంది మరణించారు, 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.