Balochistan Bomb Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 34 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
At least 34 Killed in Balochistan Bomb Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 34 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించిందని జియో న్యూస్ పేర్కొంది. ఈ ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నవాజ్ గష్కోరి మరణించారు.
ముహమ్మద్ ప్రవక్త జయంతి మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని మదీనా మసీదు వద్ద ఈరోజు మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృతిచెందగా.. మరో 130 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Also Read
Also Read: Kane Williamson Out: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కేన్ మామ దూరం!
సూసైడ్ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే తనను తాను పేల్చుకున్నాడని సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ జావేద్ లెహ్రీ తెలిపారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు తరలించామని, అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించామని బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అచక్జాయ్ చెప్పారు.
Over 15 killed and 70 injured in bomb blast at Mastung of Balochistan. pic.twitter.com/VNetMvPfZC
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 29, 2023
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?