Bomb Blast: పాకిస్థాన్ దేశంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ మైదానంలో ఒక భారీ బాంబు పేలుడు సంభవించింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి, ఆ ప్రదేశంలో అతి దట్టమైన పొగలు వ్యాపించాయి. పేలుడు తీవ్రం కారణంగా ఒక వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం. అలాగే పేలుడు దాటికి పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదకర పేలుడు ఘట్టం అనంతరం క్రికెట్ ఆడుతున్న…
Pakistan: పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ క్రూరంగా కాల్చి చంపింది. ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే, బలూచ్ ప్రజలు తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. ఇందుకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ సైనికులు, అధికారులే టార్గెట్‌గా దాడులకు…
Taliban Minister Rehman Haqqani Killed: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో తాలిబాన్ ప్రభుత్వంలోని శరణార్థుల వ్యవహారాల మంత్రి మరణించారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర హోంశాఖ అధికారులు సమాచారాన్ని వెల్లడించారు. మంత్రిత్వ శాఖలో పేలుడు సంభవించడంతో శరణార్థుల వ్యవహారాల మంత్రి ఖలీల్ హక్కానీ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో అతని ముగ్గురు అంగరక్షకులు సహా 12 మంది మరణించారు. మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత…
Bomb Blast In Night Club: మంగళవారం తెల్లవారుజామున చండీగఢ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. సెక్టార్ 26లో ఉన్న నైట్‌క్లబ్‌పై అనుమానిత దుండగులు పేలుడు పదార్థాలను విసిరారు. నైట్ క్లబ్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాలు విసిరినట్లు సమాచారం. ఆ క్లబ్ రాపర్ బాద్షాకు చెందినది. అయితే, పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని ఖండించారు. సెక్టార్ 26లో ఉన్న నైట్ క్లబ్‌పై ఇద్దరు గుర్తుతెలియని బైకర్లు అనుమానాస్పద పేలుడు పదార్థాలను విసిరినట్లు చెబుతున్నారు.…
Delhi Police: ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ దగ్గర ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక, అంశంపై తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని దర్యాప్తు టీమ్ ఆ లేఖలో కోరింది.
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. నిద్రిస్తున్న వీఆర్‌ఏ మంచం కింద బాంబులు పెట్టి పేల్చారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఈ ఘటనలో వీఆర్‌ఏ ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్య తీవ్రగాయాలపాలయ్యారు.. ఇక, వీఆర్‌ఏ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయినట్టుగా చెబుతున్నారు.. ఈ దారుణానికి పాతపక్ష్యలే కారణంగా అనుమానిస్తున్నారు..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పేలుడు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.
మేడే వేళ తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. విరుదునగర్ జిల్లా కారియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సంఘటన జరిగిన ప్రదేశంలోనే మరణించగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తాజాగా పాకిస్తాన్ దేశంలోని కరాచీ నగరంలో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి శుక్రవారం పాల్పడ్డారు. ఈ దాడిలో ముఖ్యంగా విదేశీయులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఈ సంఘటనలో సూసైడ్ బాంబర్ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు అక్కడ స్థానిక మీడియా తెలిపింది. లాంధీలోని మన్సేరా కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. Also read: Prakash Goud: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ప్రకాశ్ గౌడ్ ఈ దాడి జరిగిన సమయంలో…