బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్ వద్ద బాంబు పేలింది. ఈ పేలుడులో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించగా.. పంచాయతీ పెద్ద గాయపడడం రాజకీయ వర్గాల్లో వాగ్వాదానికి దారితీసింది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ బృందం ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
Jammu Kashmir : సాధారణంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్‌ల ఘటనలు తరచూ వార్తల్లో చూస్తుంటాం. ఐతే ఈసారి నర్వాల్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. నర్వాల్‌లో ట్రక్కుల హబ్‌గా పేరొందిన ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో ఉన్న ఓ యార్డ్‌లో భారీ శబ్ధంలో పేలుళ్లు సంభవించాయి.
Four killed in bomb blast in Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో బాంబు పేలుడు జరిగింది. నామక్కల్ జిల్లా మోగనూరులో ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలోొ ఇంట్లో నాటు బాంబులు తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పేలుడు ధాటకి పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
Bomb Blast : పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.తూర్పు మేదినీపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడి ఇంటిపై జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించారు.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ ప్రాంతంలో శనివారం జరిగిన ముడి బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన సోఫికుల్ ఇస్లాం (32), ఫజ్రుల్ సేఖ్ (37)గా గుర్తించారు.