Mahabubabad Stone Crusher Bomb Blast: మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. బుధవారం అర్ధరాత్రి స్టోన్ క్రషర్‌లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్‌కు పక్కనే ఉన్న గ్రామంలోని ఇళ్ల గోడలకు బీటలు వారాయి. బాంబు పేలుళ్లకు భయంతో జనాలు ఇల్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆపై అదే రాత్రి స్టోన్ క్రషర్ వద్ద గ్రామస్తుల ఆందోళనకు దిగారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రకారం క్రషర్ స్టోన్ ఉందని యాజమాన్యం చెబుతోంది.
గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులో రేణుక స్టోన్ క్రషర్ ఉంది. తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రషర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు ఎప్పటినుంచో అడ్డుకుంటున్నారు. అయినా రేణుక స్టోన్ క్రషర్ యాజమాన్యం తమ పని చేసుకుంటూ పోతున్నారు. బుధవారం అర్ధరాత్రి స్టోన్ క్రషర్‌లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. భారీ పెలుళ్లకు గాజులగట్టు గ్రామంలోని ఇళ్ల గోడలకు బీటలు వారాయి. భారీ బండారాళ్లకు ప్రధాన రహదారులకు సైతం గుంతలు పడ్డాయి. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంట పొలాలలో భారీ బండారాళ్ళు ఎగిరి పడడంతో పంట నష్టం జరిగింది.
Also Read: Cold weather: పశువులపై ప్రేమ.. గోనె సంచులు కుట్టించిన రైతు! వీడియో వైరల్
నెక్కొండ రహదారి పక్కనే క్రషర్ పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయం భయంతో ప్రయాణించారు. బాంబ్ బ్లాస్టింగ్ ధూళి, దుమ్ముతో గాజులగట్టు గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అర్ధ రాత్రి క్రషర్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రకారం క్రషర్ ఉందని యాజమాన్యం చెబుతోంది. దాంతో గాజులగట్టు గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు.