అడవి శేష్ ‘మేజర్’ సినిమాకు హిందీలో బంపర్ ఆఫర్ తగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు క్రేజీ ఆఫర్ వచ్చింది. సాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లు కొల్లగొట్టింది ‘మేజర్’ సినిమా.అడవి శేష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న ‘మేజర్’ మూవీ అమర జవాన్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన ‘26/11’ ముంబై ఉగ్ర దాడుల్లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణ త్యాగం చేశాడు. మేజర్ ఉన్నికృష్ణన్ గా శేష్…
జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘గల్లీ బాయ్’ మొదట రణబీర్ వద్దకు వెళ్లింది. కానీ, కపూర్ వద్దనటంతో మన సింగ్ గారి వద్దకు వెళ్లింది. రణబీర్ వద్దన్న పాత్రని రణవీర్ సింగ్ ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే, ‘గల్లీ బాయ్’ సూపర్ హిట్! జోయా అఖ్తర్ సినిమా రణబీర్ వద్దనటం ‘గల్లీ బాయ్’ విషయంలోనే కాదు… మరోసారి కూడా జరిగింది. ‘దిల్ దఢక్ నే దో’ సినిమాలో అనీల్ కపూర్ తనయుడిగా రణబీర్ నటించాల్సింది.…
కొందరు హీరోయిన్స్ తొలి చిత్రంతోనే సంచలనం అవుతారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ మూవీలోని జోష్ ని తరువాత కూడా కంటిన్యూ చేస్తారు. అమీషా పటేల్ ఖచ్చితంగా ఆ వర్గం కాదు. మొదటి సినిమా ‘కహోనా ప్యార్ హై’! హృతిక్ రోషన్ కి కూడా అదే ఫస్ట్ మూవీ! కానీ, హృతిక్ ఇప్పటికీ టాప్ స్టార్ గా కొనసాగుతుండగా అమీషా మాత్రం దాదాపుగా తెరకు దూరమైపోయింది. ఆమె ఈ మధ్యలో చేసిన చెప్పుకోదగ్గ…
బాలీవుడ్ అంటే గాసిప్స్. ఆ గాసిప్స్ నిండా దాదాపు ఎఫైర్లే. అయితే, పెళ్లికాని ఇద్దరు యంగ్ సింగిల్ సెలబ్స్ ఎంతగా మింగిల్ అయినా మునిగేదేం లేదు. కానీ, ఓ పెళ్లైన పెద్దాయన మనసు కుమారిని చూసి మారిపోతే? పెద్ద పెంటే అవుతుంది! అదే జరిగింది అజయ్ దేవగణ్, కాజోల్ దేవగణ్ మధ్య…కాస్త్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… 22 ఏళ్లుగా మిష్టర్ అండ్ మిసెస్ దేవగణ్ తమ సంసారం చక్కగానే నెట్టుకొస్తున్నారు. వారి ఇద్దరి పిల్లులు న్యాసా,…
2017 నుండి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా రామాయాణ గాథను త్రీడీలో మూడు భాషల్లో, మూడు భాగాలుగా నిర్మించాలని కలలు కంటున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకునే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నితేశ్ తివారి, రవి ఉద్యావర్ భుజానకెత్తుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రను హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటిస్తారనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: ‘కలర్స్’…
షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ రెగ్యులర్ ఎస్ఆర్కే ఎంటర్టైనర్ కాదు. ‘జీరో’ మూవీ తరువాత సుదీర్ఘ విరామం తీసుకున్న బాద్షాని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే, తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా రొమాంటిక్ స్టార్ షారుఖ్ ఈసారి ‘రా ఏజెంట్’గా రచ్చ చేయబోతున్నాడు. ‘పఠాన్’కి అసలు హైలైట్ హై ఓల్టేజ్…
దక్షిణాది భామలు బాలీవుడ్ లో తమ సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముందుగా టాలీవుడ్ లో పరిచయమైన ఇలియానా, తాప్సి తదితరులు బాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించారు. ఇటీవల కన్నడ సోయగం రష్మిక మందన్న రెండు హిందీ ఆఫర్లను దక్కించుకుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″తో సమంత కూడా నార్త్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజా సమాచారం ప్రకారం సౌత్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవికి బాలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాయి…
బాలీవుడ్ రచయితల్లో మోస్ట్ పాప్యులర్ గా చెప్పుకోవాల్సిన పేర్లు సలీమ్ – జావేద్. వారిద్దరి ముందు కూడా హిందీ సినిమా రంగంలో చాలా మంది అద్భుతమైన రచయితలు ఉన్నారు. తరువాత కూడా ఇంకా ఎందరో కలం విదిలించి కదం తొక్కారు. అయితే, సలీమ్, జావేద్ ద్వయం మాత్రం బాలీవుడ్ సినిమాను ఓ కీలకమైన మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. వారి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని కమర్షియల్ గా షేక్ చేశాయి. అమితాబ్ లాంటి హీరోల్ని యాంగ్రీ యెంగ్…
కన్నడ సోయగం రష్మిక మండన్న షూటింగ్ కోసం తిరిగి ముంబై చేరుకుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులను ప్రకటించింది. దీంతో బాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ “గుడ్‌బై” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి రష్మిక మండన్న ఈరోజు ముంబైలో అడుగుపెట్టింది. “గుడ్‌బై” చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్…