‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్ తో ఇప్పుడు అందరి దృష్టీ మనోజ్ బాజ్ పాయ్ మీద పడింది. ఆయన నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేకున్నా ‘సత్య’ మూవీ యాక్టర్ గురించి ఈ తరం ఓటీటీ జెనరేషన్ కి మరీ ఎక్కువ తెలియదనే చెప్పాలి. అందుకే, ఆయన పెద్ద తెర మీద కన్నా ఇప్పుడు బుల్లితెర పై వెబ్ సిరీస్ లతో హల్ చల్ చేస్తున్నాడు. సరికొత్తగా ఈ తరం ప్రేక్షకుల్ని తన…
కంగనాకి కూడా కరెన్సీ కష్టాలు తప్పటం లేదు! కారణం అంటారా… ఏముంది, కరోనా మహమ్మారే! ఈ మద్యే ఆమెకు వైరస్ సోకింది. త్వరగానే బయటపడింది మన స్ట్రాంగ్ లేడీ. అయితే, బాలీవుడ్ ‘క్వీన్’కి కరోనా వల్ల ఆరోగ్య సమస్యలే కాదు ఆర్దిక సమస్యలు కూడా తప్పటం లేదట. పోయిన సంవత్సరం ట్యాక్స్ కూడా తాను ఇంత వరకూ పూర్తిగా పే చేయలేదని ప్రకటించింది బీ-టౌన్ ‘తలైవి’! కంగనా ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న యాక్టర్.…
బాలీవుడ్ లో డింపుల్స్ అనగానే ఎవరికైనా ఇప్పుడు దీపికా పదుకొణేనే గుర్తుకు వస్తుంది! ముంబైలో నంబర్ వన్ బ్యూటీగా రాజ్యమేలుతోన్న రాణీ ‘పద్మావతీ’ నవ్విందంటే మాత్రం అంతే! ఎంతటి వారైనా మన టాల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సొట్ట బుగ్గుల సొగసుకి దాసోహమైపోతారు!బోలెడు హారర్ చిత్రాలు చేసిందిగానీ… హాట్ బెంగాలీ బ్యూటీ బిపాషా… సూపర్ సెక్సీ! ఆమె అందానికి తగిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ తన కెరీర్ లో పెద్దగా రాలేదనే చెప్పాలి. ఇక బిప్స్…
‘కర్ణి సేన’… ఈ పేరు చెబితే బాలీవుడ్ అమాంతం అలెర్ట్ అవుతుంది! ఎందుకంటే, రాజ్ పుత్ వర్గం వారి ఈ సంస్థ ఇప్పటికి చాలా సార్లు హిందీ సినిమాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, కర్ణి సేన డిమాండ్లకు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకోకుంటే వివాదాలు చిలికి చిలికి గాలివాన అవుతుంటాయి. ఇక అక్షయ్ కుమార్ నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ తాజాగా కర్ణి సేన కంట్లో పడింది. ఆ సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’…
‘గల్లీ బాయ్’ సినిమాతో తన డిఫరెంట్ టేస్ట్ ను మరోసారి ప్రూవ్ చేసుకుంది జోయా అఖ్తర్. వెటరన్ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ కూతురుగా మెగాఫోన్ పట్టుకున్న మిస్ జోయా క్రమంగా తన సత్తా చాటుతూ వస్తోంది. ‘జిందగీ నా మిలేగి దుబారా, దిల్ ధడక్ నే దో’ లాంటి చిత్రాలతో యూత్ ను తెగ ఆకట్టుకోగలిగింది. ఆమె తాజాగా మరో సినిమాకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి కంప్లీట్ యూత్ ఫుల్ కాంబినేషన్ కు తెర తీసింది……
సినిమా ఇండస్ట్రీ అంటే కళలు, కలలు మాత్రమే కాదు… కాంపిటీషన్ కూడా! నిజానికి గ్లామర్ ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే ఉధృతమైనది పోటీనే! ఆ పోటీకి తట్టుకోలేకే చాలా మంది కొట్టుకుపోతుంటారు. అయిదేళ్లో, పదేళ్లో లైమ్ లైట్ లో నిలిస్తే అదే గొప్ప! ఇక పదేళ్ల తరువాత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు సత్తా చాటితే అంతగా లెజెండ్స్ అయిపోతుంటారు సినిమా సెలబ్రిటీలు! మరి ఒక వ్యక్తి ఏకంగా 52 ఏళ్లు… అంటే, అర్థ శతాబ్దానికంటే ఎక్కువగా… దేశం మొత్తాన్ని…
బాలీవుడ్ లో బయోగ్రఫీల ట్రెండ్ సాగుతూనే ఉంది. రోజుకొకరు ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ తీస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే సైనా బయోపిక్ తో పరిణీతి చోప్రా మన ముందుకొచ్చింది. ఇక తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ గా తెరపై కనిపించే ప్రయత్నాల్లో ఉంది. మరో వైపు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘వీర సావర్కర్’ జీవితగాథ తెరపైన చూపిస్తానంటూ లెటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బయోపిక్ రేసులోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా…
ఈ మధ్య కాలంలో కరణ్ జోహర్ అంటే అదో కాంట్రవర్సియల్ నేమ్ గా మారిపోయింది. మొదట కంగనా నెపోటిజమ్ కామెంట్స్, ఆ తరువాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో, బాలీవుడ్ మాఫియా అంటూ ఆరోపణలు… ఇలా పుట్టెడు చిక్కుల్లో ఉన్నాడు కేజో. కానీ, ఆయన నెగటివ్ పాయింట్స్ ఎలా ఉన్నా బోల్డ్ థింకింగ్ మాత్రం కాదనలేనిది! ‘కాఫీ విత్ కరణ్’ అంటూ టాక్ షో నిర్వహించి రకరకాల చర్చలకు, వివాదాలకు కారణం అవుతుంటాడు కరణ్. కానీ,…
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. కానీ దానికి మరికాస్తంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీయార్ తో మూవీ చేస్తానని మాటిచ్చారు. సో… ఆ తర్వాతే బన్నీ – కొరటాల శివ మూవీ ఉంటుంది. సో… ఈ లోగా వేరే దర్శకులతో సినిమా చేయడానికి అల్లు అర్జున్…
అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం ‘మేడే’. థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా చాలా భాగం హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఫిల్మ్ సిటీలో బిగ్ బి, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతర నటీనటులు పాల్గొన్న షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. అయితే, లాక్ డౌన్ కారణంగా అజయ్ దేవగణ్ ఇతర సినిమాల మాదిరిగానే ‘మేడే’ కూడా సందిగ్ధంలో పడింది. అజయ్ నటించిన ‘భుజ్’, ‘మైదాన్’ సినిమాలు కూడా జనం ముందుకు రావాల్సి ఉంది.…