సొషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలే కాదు… వారి ఫ్యామిలీ మెంబర్స్ మనస్సుల్లో మాటలు కూడా జనానికి తెలిసిపోతున్నాయి. చాలా మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి వాటిల్లో తమ మనోభావాలు పంచుకుంటున్నారు. గతంలో అయితే, ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేస్తేగానీ బయటకు రాని విషయాలు ఇప్పుడు ఆన్ లైన్ లో అలవోకగా నెటిజన్స్ ముందుకు వస్తున్నాయి. లెటెస్ట్ గా ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ అటువంటిదే ఒక వ్యక్తిగతమైన జ్ఞాపకం ఇన్ స్టా ఫాలోయర్స్ తో షేర్ చేసుకుంది…
ఆమీర్ , రీనా దత్తా కూతురు ఇరా సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు, తన పర్సనల్ విషయాలు చాలా వరకూ మొహమాటం లేకుండా కుండ బద్ధలు కొట్టి చెబుతుంటుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ నూపుర్ శిఖ్రేని ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా… తమ రొమాంటిక్ వెకేషన్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటుంది. రైట్ నౌ… లవ్ బర్డ్స్ ఇద్దరూ హిమాచల్ లో ఉన్నారు!
Read Also : శుక్రవారం ‘లక్ష్య’మ్’గా….
ఇరా ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో తన తల్లి కొన్నేళ్ల క్రిందట ఇచ్చిన ఓ పుస్తకం గురించి ప్రస్తావించింది. రీనా దత్తా ఆమెకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించిన బుక్ ఇచ్చి చదవమని చెప్పిందట. అందులో అద్దంలో తనని తాను చూసుకొమ్మని రాసి ఉందట! అలాంటి పని ఇంత వరకూ తాను చేయలేదు కానీ… తల్లి రీనా ఇచ్చిన సెక్స్ ఎడ్యుకేషన్ బుక్, వయసు పెరుగుతోన్న క్రమంలో, ఎంతో ఉపయోగపడిందని ఇరా చెప్పింది!
శరీరంలో కొత్త మార్పులు, మనసులో కొత్త కొత్త కోరికలు కలుగుతున్నప్పుడు… టీనేజ్ లో… ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు శృంగారం పట్ల అవగాహన కల్పించటం సమర్ధించాల్సిన విషయమే. ఆమీర్ తో విడాకుల తరువాత ఇరానీ సింగిల్ పేరెంట్ గా పెంచి పెద్ద చేసిన రీనా సెక్స్ ఎడ్యుకేషన్ బుక్ కూతురికి అందించి మంచి చేసిందనే అంటున్నారు ఎక్కువ మంది నెటిజన్స్!