బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2’ షూటింగ్ అఫీషియల్ గా స్టార్టైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన విద్యుత్, టీమ్ మెంబర్స్ తో తాను కలసి ఉన్న ఫోటోని, నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. చేతిలో క్లాప్ బోర్డ్ తో కుమార్ మంగత్ పాతక్ మధ్యలో కూర్చుని ఉండగా… పిక్ లో మనం హీరో విద్యుత్, హీరోయిన్ శివాలీకా ఒబెరాయ్, డైరెక్టర్ ఫరూక్ ని కూడా చూడవచ్చు.
Read Also : సెప్టెంబర్ లో శ్రీకాంత్ తనయుడి ‘పెళ్లి సందD’
‘ఖుదా హఫీజ్’ 2020లో అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సమీర్ చౌదరీ అనే క్యారెక్టర్ లో హీరో విద్యుత్ జమ్వాల్ తన భార్య నర్గీస్ ని మిడిల్ ఈస్ట్ నుంచీ క్షేమంగా వెనక్కి తెచ్చుకుంటాడు. నర్గీస్ గా నటించిన శివాలీకా ఒబెరాయ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురై విదేశాలకు తరలుతుంది. అక్కడ నరకంలో చిక్కుకున్న ఆమెని హీరో కాపాడుకుంటాడు. అయితే, ‘ఖుదా హఫీజ్’ హ్యాపీ ఎండింగ్ మూవీనే అయినప్పటికీ ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2’ మరింత కొత్త ట్విస్ట్ తో స్టోరీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అని హీరో అన్నాడు. తమ సీక్వెల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని డైరెక్టర్ ఫరూక్ వ్యక్తం చేశాడు…