దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమాలు రెండు. 2006లో వచ్చిన ‘రంగ్ దే బసంతి’, 2013లో విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ఫర్హాన్ అక్తర్ తోనే మరో స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను తెరకెక్కించి, ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని మరోసారి గుర్తు చేశారు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే… ఆయన గత చిత్రాలతో పోల్చినప్పుడు ‘తూఫాన్’ ఆ స్థాయిలో లేదనే నిరాశ వీక్షకులకు కలుగుతుంది. కానీ ఇప్పటికీ…
మందాకిని మళ్లీ తెరపైకి వచ్చేస్తోంది! లెజెండ్రీ బాలీవుడ్ యాక్ట్రస్ ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ పరిశీలిస్తోందట. అయితే, ఇంకా ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలన్నది 57 ఏళ్ల సీనియర్ నటి నిర్ణయించుకోలేదు. ఆమెకు నచ్చిన ప్రాజెక్ట్ ఎదురైతే అధికారిక ప్రకటన చేస్తుందని మందాకినీ మ్యానేజర్ మీడియాతో తెలిపాడు. త్వరలోనే ‘రామ్ తేరీ గంగా మైలీ’ సూపర్ స్టార్ ఆసక్తికరమైన పాత్రతో తెర మీదకు మాత్రం తప్పక వస్తుందని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు……
ప్రస్తుతం ఇటు బాలీవుడ్ సినీ ప్రేమికుల్ని, అటు క్రికెట్ లవ్వర్స్ ని ఆకర్షిస్తోన్న రొమాంటిక్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు… అతియా, కేఎల్ రాహుల్ లవ్ స్టోరీ! వాళ్లిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు తీవ్రంగా మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు, సునీల్ శెట్టి కూతురు అతియా తన ‘రూమర్డ్ బాయ్ ఫ్రెండ్’తో ప్రస్తుతం లండన్ లోనే ఉందట. అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచెస్ కి వెళ్లిన రాహుల్ తనతో బాటూ అతియాని తీసుకెళ్లాడు. ఆమెని అఫీషియల్ గా…
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తన మొదటి చిత్రం “అల్లుడు శీను” డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛత్రపతి” హిందీ రీమేక్ తో. ‘ఛత్రపతి’ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. కాగా తాజాగా ఈ రోజు సినిమా ప్రారంభం జరిగింది. రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Read Also…
బుక్ రాసినందుకుగానూ కరీనాపై కేసు బుక్కైంది! ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో తైమూర్, జెహ్ వాళ్ల మమ్మీ ఓ పుస్తకం రాసింది. తాను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి శారీరిక, మానసిక అనుభవాలకు లోనైంది బెబో తన పుస్తకంలో వివరించింది. అయితే, సదరు ‘ప్రెగ్నెస్సీ’ ఎక్స్ పీరియెన్సెస్ కి ‘బైబిల్’ పదం జత చేయటంతో ‘అల్ఫా ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్’ సంస్థకు కోపం వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ పట్టణంలో కరీనాతో పాటూ మరికొందరిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు! Read…
బాలీవుడ్ లో ఎస్ఆర్కే అంటే విజయానికి మారు పేరు! కానీ, కేఆర్కే అంటే వివాదానికి మరో పేరు! తన నోటి దురద కామెంట్స్ తో షారుఖ్ తో సమానంగా పాప్యులర్ అయిన కమాల్ ఆర్ ఖాన్ ఇంకోసారి మాటలు సంధించాడు. ఈసారి ప్రియాంక చోప్రా టార్గెట్ అయింది! కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఓ వింతైన, వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు. కేఆర్కే లెక్కల ప్రకారం మిసెస్ జోనాస్…
పాము కుబుసం విడిచినట్టు కమర్షియల్ సినిమా హీరోలు, హీరోయిన్స్ కూడా ఎప్పుడో ఓ సారి అధిక కవ్వు వదిలించుకోక తప్పదు! ఆ టైం ఇప్పుడు ఇమ్రాన్ హష్మీకి వచ్చింది! ‘మర్డర్’ లాంటి సినిమాల్లో తన ‘పెదవుల’ పనితనంతో బాగా ఫేమస్ అయిన ఈ సీరియల్ కిస్సర్ ఇప్పుడు కండలతో కలకలం రేపాడు…ఇమ్రాన్ హష్మీ గతంలో ఎప్పుడూ సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించలేదు. తన సినిమాల్లో రొమాన్స్ అండ్ పర్ఫామెన్స్ తోనే నెట్టుకొచ్చాడు. కానీ, లెటెస్ట్ గా ఆయన…
మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ పై కన్నేశాడా!? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ చిత్రంతో పాటు, వెంకటేశ్ తో కలిసి ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు కాస్తంత ముందు వెనుకగా ఈ యేడాదే విడుదల అవుతాయని తెలుస్తోంది. దీని తర్వాత వరుణ్ తేజ్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ లేదు. అయితే అతి త్వరలోనే వరుణ్ తేజ్ హిందీలో…
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో దిలీప్ కుమార్ స్థానం ప్రత్యేకమైనది. భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో ఎందరో మహానటులు తమదైన అభినయంతో అలరించారు. అలాంటి వారిలో దిలీప్ కుమార్ ఒకరు. ఆ తరం మహానటుల్లో మిగిలివున్న ఏకైక నటుడు ఆయనే! అందుకే అందరూ దిలీప్ కుమార్ ను ‘ద లాస్ట్ థెస్సియన్’ అంటూ కీర్తిస్తారు. ఉత్తరాదిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ త్రిమూర్తులు జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో దక్షిణాదిన తెలుగులో యన్టీఆర్ – ఏయన్నార్, తమిళంలో…
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి చెందారు. ఇవాళ ఉదయం 7 : 30 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు రూరల్ యాస్పిరేషన్ ప్రొసీజర్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందించారు వైద్యులు. read also : మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు.…