జూలై 19న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రాజ్ కుంద్రా కీలక నిందితుడు అని కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. రాజ్ కుంద్రాపై అశ్లీలతకు సంబంధించిన కేసు ఫిబ్రవరిలో నమోదైంది. అప్పట్లో మధ్ ద్వీపంలో లైవ్ వీడియో పోర్న్ చిత్రీకరణ రాకెట్‌ను పోలీసులు పట్టుకోగా, దానికి సంబంధించిన దర్యాప్తులో రాజ్ పేరు వెల్లడైంది. కెన్రిన్ అనే యుకె సంస్థ ప్రమేయంతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దానిని ఇంతకుముందు రాజ్ దగ్గర పని చేసిన ఉమేష్ కామత్ నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కామత్ సోషల్ మీడియా యాప్‌లో అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Read Also : క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించిన “అఖండ”
ఇక ఇందులో రాజ్ కుంద్రాను కీలక నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. జూలై 23 వరకు కోర్టు అతన్ని రిమాండ్ కు తరలించాల్సిందిగా ఆదేశించింది. తాజాగా ఈరోజు మరోసారి అతడిని మేజిస్ట్రేట్ కోర్టు ముందు నిలబెట్టగా పోలీసుల రిక్వెస్ట్ ప్రకారం ఈ నెల 27 వరకు పోలీస్ కస్టడీకి పంపారు. రాజ్ కుంద్రాతో పాటు ర్యాన్ తోర్పెను కూడా జూలై 27 వరకు పోలీసు కస్టడీకి పంపారు. అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతా మధ్య లావాదేవీలను విచారించాల్సిన అవసరం ఉందని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించినట్టు తెలుస్తోంది.