‘డర్’ సినిమా గుర్తుందా? 1993లో విడుదలైన ఆ చిత్రం బాలీవుడ్ మూవీ లవ్వర్స్ కి ఎవర్ గ్రీన్! అందులో హీరో కంటే విలన్ గా నటించిన షారుఖ్ ఖాన్ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది! అయితే, ‘డర్’ సినిమా కింగ్ ఖాన్ కు ఎంత హెల్ప్ చేసిందో సన్నీ డియోల్ కి అంత డ్యామేజ్ కూడా చేసింది. సినిమాలో ఆయనే హీరో అయినా మార్కులు మొత్తం ఎస్ఆర్కే ఖాతాలో పడ్డాయి. పైగా ఓ గొడవ కారణంగా సన్నీ 16 ఏళ్లు షారుఖ్ తో మాట్లాడలేదు కూడా…
Read Also : సూర్య స్థానంలో హృతిక్! సాధ్యమేనా?
‘డర్’ సినిమా షూటింగ్ సమయంలో హీరో సన్నీ డియోల్ కి, దర్శకుడు యశ్ చోప్రాకి తీవ్రమైన వాదన జరిగిందట. నెగటివ్ రోల్ పోషించిన షారుఖ్ క్లైమాక్స్ లో సన్నీని గాయపరుస్తాడు. కానీ, నిజానికి ‘డర్’లో హీరో పాత్ర ఓ కమాండో! మరి అలాంటి వీరుడు, ఆర్మీలో ట్రైనింగ్ తీసుకున్న వాడు… అంత ఈజీగా షారుఖ్ చేతిలో దెబ్బ ఎలా తింటాడు? ఇదే ప్రశ్న యశ్ చోప్రాను డియోల్ అడిగాడట! ఆయన మాత్రం ఎంత చెప్పినా క్లైమాక్స్ మార్చటానికి ఒప్పుకోలేదు. దాంతో ఆగ్రహం కట్టలుతెంచుకున్న సన్నీ ఏం చేస్తున్నాడో తెలిసేలోపే… తన ప్యాంట్ కూడా చింపేశాడట!
‘డర్’ సినిమా విషయంలో యశ్ చోప్రాతో గొడవని స్వయంగా సన్నీ డియోలే ‘ఆప్ కీ అదాలత్’ ఇంటర్వ్యూలో వివరించాడు. అంతే కాదు, ఆ సినిమా తరువాత 16 ఏళ్ల పాటూ షారుఖ్ తో సన్నీ డియోల్ మాట్లాడలేదట. ఉద్దేశ్యపూర్వకంగా కాకున్నా ఎస్ఆర్కేకి ఎదురుపడకుండానే డియోల్ అన్నేళ్లు గడిపేశాడట! అయినా 1993 నాటికి బాలీవుడ్ బాద్షా కేవలం ఓ స్ట్రగులర్. సన్నీ సక్సెస్ ఫుల్ స్టార్. అయినా కూడా యశ్ చోప్రా ఖాన్ కి ప్రాధాన్యత ఇవ్వటం సహజంగానే కోపం తెప్పించి ఉంటుంది! ఇటువంటి ఇగో వార్స్ ఏ సినిమా రంగంలో అయినా మామూలే కదా…