ఆశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హాట్ హిట్ యాప్ నుంచి వస్తున్న ఆదాయం చూసి పోలీసులే నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బాలీవుడ్‌లో అవకాశాల కోసం వచ్చిన మోడల్స్‌ను పోర్న్ మూవీస్‌లో నటించాలని కుంద్రా ఒత్తిడి చేసేవాడని దర్యాప్తులో తేలింది.
Read: పుష్ప : అల్లు అర్జున్, ఫహద్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్…!!
అశ్లీల చిత్రాల కంపెనీ పెట్టి, రోజుకు లక్షలు గడిస్తున్న రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో రాజ్ కుంద్రా బ్యాంకు అకౌంట్స్ డీటెయిల్స్ బయటపడ్డాయి. దాని ద్వారా అతడు రోజుకు లక్ష నుంచి పది లక్షలు సంపాదిస్తున్నట్లు తేలింది. కాగా… రెండు రోజుల క్రితం ఆశ్లీల చిత్రాల కేసులో..రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.