అలనాటి బాలీవుడ్ సంగీత దర్శకుల్లో ఒకరు ఖయ్యామ్. ఆయన భార్య జగ్జీత్ కౌర్ ఆదివారం మరణించారు. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల ఆమె 93 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. జగ్జీత్ కౌర్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నేపథ్య గాయనిగా ప్రతిభను చాటుకున్నారు. కేవలం 21 చిత్రాల్లో మాత్రమే ఆమె గానం వినిపించినా ఆణిముత్యాల్లాంటి పాటల్ని జగ్జీత్ కౌర్ ఆలపించారు. హిందీ సినిమా రంగంలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరున్న ఖయ్యామ్ రెండేళ్ల క్రితమే గుండెపోటుతో…
అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ నటులుగా ఇంతకు ముందు కూడా కలసి పని చేశారు. కానీ, ఇప్పుడు అజయ్ డైరెక్టర్ గా బిగ్ బీతో సినిమా చేస్తున్నాడు. అదే ‘మేడే’. సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఇందులో ఉండటం విశేషం!“అమితాబ్ ని డైరెక్ట్ చేయటం, ఏ దర్శకుడికైనా గొప్ప కల. అదృష్టవశాత్తూ నేను ఆ స్వప్నం సాకారం చేసుకోగలిగాను!” అన్నాడు అజయ్ దేవగణ్. అంతే కాదు బచ్చన్ సాబ్ సెట్ మీద ఉంటే పనులన్నీ చకచకా…
హిందీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేవారికి ఈ వారాంతంలో మూడు ధమాకా షోస్ ఉన్నాయి. మొదటిది, అఫ్ కోర్స్… ఇండియన్ ఐడల్ 12! ఈ వీకెండ్ తో మ్యూజికల్ రియాల్టీ షో ప్రజెంట్ సీజన్ ఎండ్ అవుతోంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 12 గంటల పాటూ సాగే గ్రాండ్ ఫినాలే అతి పెద్ద హైలైట్ గా నిలవనుంది. గత ఇండియన్ ఐడల్ విన్నర్స్ తో పాటూ బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ కూడా…
ఈ మధ్య కాలంలో వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ -పాక్ వార్ నేపథ్యంలో ‘ఘాజీ’ లాంటి పాన్ ఇండియా మూవీని తెలుగువాళ్ళు తీయడం విశేషం. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాల మధ్య 1971లో జరిగిన వార్ నేపథ్యంలో ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీ రూపుదిద్దుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా ప్రారంభంలోనే ‘భుజ్’…
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ముంబైలో తన లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించారు. బి టౌన్ వార్తల ప్రకారం అభిషేక్ బచ్చన్ తన పాత అపార్ట్మెంట్లలో ఒకదాన్ని రూ .45.75 కోట్లకు విక్రయించారు. నిజానికి అభిషేక్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఈ అపార్ట్మెంట్లో నివసించలేదు. నటుడు తన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి ముంబైలోని బచ్చన్ కుటుంబానికి చెందిన…
‘బార్డర్’ సినిమా బాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయి. సాధారణంగా హిందీ తెరపై బోలెడు రొమాంటిక్ సినిమాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో చాలా చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ అనిపించుకుంటాయి కూడా. కానీ, ‘బార్డర్’ దేశభక్తితో ఉప్పొంగే చిత్రం. లాంగేవాలా ప్రాంతంలో మన వీర జవాన్లు ప్రదర్శించిన సాహసాలకు తెర రూపం. ఎందరో సైనికుల త్యాగాలకు వెండితెర తార్కాణం… జేపీ దత్తా ‘బార్డర్ ‘ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇప్పటికి 24 ఏళ్లు పూర్తైనప్పటికీ… అక్షయ్ ఖన్నా, సునీల్…
ఒకప్పుడు మన హీరోలు స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసేవారు. దాంతో ఒక్కో హీరో ఖాతాలో వందలాది సినిమాలు ఉంటూ వచ్చాయి. కాలం మారింది. పర్ ఫెక్షన్ పేరుతో ఏడాదికి ఒక సినిమా చేయటమే గగనంగా మారింది. దానికనుగుణంగా హీరోల కెరీర్ లో వంద సినిమాలు అనేది ఇంపాజిబుల్ టాస్క్ గా మారింది. ప్రత్యేకించి ఈ తరం హీరోలు వంద మార్క్ కు చేరటం తీరని కలగా మిగిలిపోతోంది. మన స్టార్ హీరోలలో చిరంజీవి 150కి పైగా…
మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటీనటులతో రాధికా ఆప్టే ఒకరు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఈ కారణంతో ఆమె ఎన్నోమార్లు వివాదాల్లో నిలిచింది. ఇక సినిమాల్లో పాత్రలు కూడా ఆమెకు తగ్గట్లుగానే ఎంపిక చేసుకుంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే పై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్లో ఈ మేరకు బాయ్ కాట్ రాధిక ఆప్టే అనే హ్యష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున…
అతిలోక సుందరి శ్రీదేవి క్రేజ్ ఎంతో తెలుగు వారికి తెలిసిందే. అయితే, తెలుగు, తమిళంలోనే కాదు ఆమె హవా హిందీ తెరపై కూడా ఓ రేంజ్లో ఉండేది. తనతో నటించేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడేవారు. జీతేంద్ర, అమితాబ్ లాంటి సీనియర్ హీరోలే కాదు సల్మాన్, షారుఖ్ లాంటి 1990ల కాలపు యువ హీరోలు కూడా శ్రీతో జోడీ కట్టారు. కానీ, కేవలం ఆమీర్ ఖాన్ మాత్రం ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు! ఆమీర్ ఖాన్,…
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ సినిమా థియేటర్లు మరికొన్ని రోజులు బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్న సినీ ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాక్ ఇచ్చింది. మహారాష్ట్రతోపాటు కేరళలో కూడా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దీనంతటికి కారణం కోవిడ్ -19. ఇప్పటికీ కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ఆరోగ్య…