బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు అర్మాన్ కోహ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో శనివారం అర్మాన్ ఇంటిపై దాడి చేసింది. ఆనంతరం అతడిని అదుపులోకి తీసుకుంది. గత కొన్ని రోజులుగా ముంబైలో డ్రగ్స్ గురించి ఎన్‌సిబికి సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఎన్‌సిబి ఆపరేషన్ ప్రారంభించి దానికి “రోలింగ్ థండర్” అని పేరు పెట్టింది. ‘రోలింగ్ థండర్’ ఆపరేషన్ కింద అర్మాన్ కోహ్లీ ఇంటిపై దాడి చేశారు. అర్మాన్ ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పెద్దల పేర్లు ఇందులో ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం అరెస్టు చేసిన డ్రగ్ పెడ్లర్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా టీవీ నటుడు గౌరవ్ దీక్షిత్ కూడా డ్రగ్స్ కేసులో శుక్రవారం అరెస్టయ్యారు. అరెస్టు చేసిన తర్వాత గౌరవ్‌ను కోర్టులో హాజరు పరచగా ప్రస్తుతం ఆయన ఎన్‌సిబి కస్టడీలో ఉన్నాడు.
Read Also : చిరిగిన బట్టలతో నటి… ముంబై పోలీసులే కారణమట!
ఇక 2018 సంవత్సరం ప్రారంభంలో కూడా అర్మాన్‌ను 41 మద్యం బాటిళ్లు కలిగి ఉన్నందుకు ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. చట్ట ప్రకారం ఎవరైనా ఇంట్లో 1 బాటిల్ ను మాత్రమే ఉంచుకోవచ్చు. ఇంకోసారి ఆయన ప్రియురాలు నీరు రాంధవా అర్మాన్‌కు వ్యతిరేకంగా శారీరక వేధింపులకు చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో కూడా అర్మాన్ ను అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ నటించిన “ప్రేమ్ రతన్ ధన్ పాయో” చిత్రంలో అర్మాన్ విలన్ గా నటించాడు. అర్మాన్ బిగ్ బాస్ 7 లో కూడా కనిపించాడు