శభాష్ “షేర్షా”… హార్ట్ టచింగ్ : అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “షేర్షా”ను బుధవారం వీక్షించారు. అల్లు అర్జున్ కు సినిమా బాగా నచ్చింది. టీమ్‌లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా. మిస్టర్ మల్హోత్రా కెరీర్ లోనే ఇది ఉత్తమ ప్రదర్శన. కియారా, ఇంకా ఇతర నటీనటులది అద్భుతమైన పర్ఫార్మెన్స్ . సినిమా టెక్నీషియన్స్ అందరికీ మై రెస్పెక్ట్. దర్శకుడు విష్ణు వర్ధన్ గారు ద్వారా అద్భుతమైన కన్విక్షన్. సర్ మీరు మా అందరిని గర్వపడేలా చేసారు. కరణ్ జోహార్ జీ, నిర్మాతలకు అభినందనలు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కోసం అమెజాన్ కు బిగ్ అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాలి” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.
Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో “షేర్‌షా” ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ ఫిల్మ్ అని ప్రకటించింది. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన “షేర్షా”ను ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
Congratulations to the entire team of #Shershaah. A very heart touching film . Career best performance by Mr. @SidMalhotra . Man who stole the show . Subtle & impactful performance by Ms @advani_kiara and all the other actors . My respect to all the technicians of the film .
— Allu Arjun (@alluarjun) September 1, 2021
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!