బ్యాడ్ న్యూస్ : విక్కీ కౌశల్ “అశ్వద్ధామ”కు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ భారీ బడ్జెట్ మూవీ ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’. తాజగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 30 కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యాయని అంటున్నారు. బాలీవుడ్ మీడియా ప్రకారం ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్రాన్ని మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారట. ఈ చిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చేశాడని, సినిమా మొత్తం బడ్జెట్‌ను చూసుకుంటే అది చాలా ఎక్కువని భావించాడని అంటున్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా సినిమాలు థియేటర్లలో పెద్దగా బిజినెస్ చేయలేకపోతున్నాయి.దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Read Also : “ఘోస్ట్”గా మారిన నాగార్జున
Also Read
ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 2 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆదిత్య ధర్ అనేక లొకేషన్లను సందర్శించి వాటిలో కొన్నింటిని షూటింగ్ కోసం ఫిక్స్ చేశారట. మరోవైపు మేకర్స్ విఎఫ్ఎక్స్ కోసం కూడా పని చేయడం మొదలుపెట్టారు. మొత్తంగా ఈ చిత్రాన్నినిర్మించడానికి ముందే 30 కోట్లు ఖర్చు అయ్యాయట. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రం ఆగిపోతే విక్కీ కౌశల్ కు భారీ నష్టమని చెప్పొచ్చు. ఇది ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భారీ చిత్రం. విక్కీ, సారాకు ఈ చిత్రం కాకుండా మరో ప్రాజెక్ట్ లో కలిసి నటించమని మేకర్స్ ఆఫర్ ఇచ్చారట. ఇప్పటివరకు ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్ర బృందం ఈ వార్తలపై రియాక్ట్ కాలేదు.
తాజావార్తలు
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!