బాలీవుడ్‌లో తెరపై బెస్ట్ కపుల్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. ఒకానొకప్పుడు సల్మాన్, కత్రినా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు గట్టిగా పట్టుబట్టారు. పైగా వీరిద్దరూ డేటింగ్ అంటూ రూమర్లు కూడా వచ్చాయి. ఏమైతేనేం సల్మాన్ అభిమానుల కోరిక మాత్రం తీరలేదు. కానీ ఇప్పటికే సల్మాన్, కత్రినా జోడి వెండితెరపై కన్పిస్తే ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతుంటారు భాయ్ అభిమానులు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో “టైగర్-3” మూవీ రూపొందుతోంది.
Read Also : ఆ గ్యాప్ లో “ఏజెంట్” దర్శకుడితో నితిన్ మూవీ
“టైగర్ జిందా హై”కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో భాగంగా సల్మాన్, కత్రినా కూడా అక్కడే ఉన్నారు. ఈ స్టార్స్ కు టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న టర్కిష్ వ్యాపారవేత్త, రాజకీయవేత్త మెహ్మెత్ నూరి ఎర్సోయ్ ఆతిథ్యం ఇచ్చారు. ఎర్సోయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సల్మాన్, కత్రినాలను కలిసిన చిత్రాలను పంచుకున్నారు. అంతర్జాతీయ తారలు… సినిమా ప్రాజెక్టులకు దేశం మద్దతు ఇస్తుంది. మంచి ఆతిథ్యం ఇస్తుంది అని ఆయన టర్కిష్‌లో రాశాడు. ఈ పిక్స్ లో కత్రినా, సల్మాన్ ఆయనతో మాట్లాడుతున్నారు.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సల్లూ భాయ్ టర్కీ మంత్రితో సత్సంబంధాలను పంచుకోవడం చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు రష్యాలో “టైగర్ 3” షూటింగ్ జరిగింది. సెట్స్ నుంచి లీకైన సల్మాన్ లుక్ వైరల్ అయ్యింది. “టైగర్ 3” కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న మూడవ చిత్రం. సల్మాన్ ఖాన్ ఇందులో స్పెషల్ ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో నటించనుండగా, కత్రినా కైఫ్ మళ్లీ జోయా హుమాయినిగా కనిపించనుంది.

