రంగుల ప్రపంచంలో నటుల జీవితాలు కలర్ ఫుల్ గా ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే వారి జీవితాలు తెర ముందు ఒకలా.. తెరవెనుక మరోలా ఉంటాయనేది కొంతమందికే తెలుసు. ఎన్నో కలలతో యువతీ యువకులు చిత్రసీమలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా మారాలని కోరుకుంటారు. అయితే లక్షల్లో ఒకరు మాత్రమే స్టార్డమ్ సంపాదిస్తుండగా మిగతా వారంతా వచ్చిన దారినే కనుమరుగై పోతున్నారు.
ఇదంతా ఇప్పుడు ఎందుకుంటే.. దూరపు కొండలు నునుపు అన్న చందంగా ప్రస్తుతం చిత్రసీమ తయారైంది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమలో అంతుచిక్కని రహస్యాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్ కేసులతో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయిన బాలీవుడ్ పరిశ్రమ ఇటీవల కాలంలో మిస్టరీ మరణాలతో వార్తల్లో నిలుస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గురువారం గుండెపోటుతో మరణించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సిద్ధార్థ్ శుక్లా మరణానికి దగ్గర పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించలేదని ఇది మూమ్మాటికీ హత్యేనని అంటున్నారు. ఆయన మరణంపై పూర్తి విచారణ జరుపాలని సిద్ధార్థ్ శుక్లా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
సిద్ధార్థ్ శుక్లా టెలివిజన్ నటుడిగా అందరికీ సుపరిచితుడు. ‘బాలికా వధూ’ అనే పాపులర్ సీరియల్ ద్వారా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్-13 సీజన్ విజేతగా నిలిచాడు. సిద్ధార్థ్ శుక్లా ‘ఆదిపురుష్’లో మేఘనాధుడి పాత్రకు ఎంపికయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే తనను ఎవరూ సంప్రదించలేదని ఆ తర్వాత సిద్ధార్థ్ శుక్లా చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే ఆయన గుండెపోటుతో కన్నుమూశారనే వార్త తాజాగా వెలుగుచూడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సిద్ధార్థ్ శుక్లా రాత్రి నిద్రపోయే ముందు కొన్ని మాత్రలు తీసుకున్నాడని.. ఆ తర్వాత అతను లేవలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతన్ని ఉదయం లేపడానికి ప్రయత్నించినప్పుడు అతను మేల్కొన లేదని అంటున్నారు.
హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతిచెందినట్లు ఆస్పత్రివర్గాలు చెబుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా మరణవార్తను ముంబైలోని కూపర్ హాస్పిటల్ సిద్ధార్థ్ ధృవీకరించింది. గతంలో ఇదే ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించారు. దీంతో సుశాంత్ మృతికి సిద్ధార్థ్ శుక్లా మరణానికి ఉన్న పోలికలను నెటిజన్లు బయటికి తీసున్నారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్, సిద్ధార్ శుక్లా మరణాలు ఒకేలా ఉండటంపై అభిమానులు షాక్ అవుతున్నారు. సుశాంత్ సింగ్ సైతం రాత్రి మందులు తీసుకున్న తర్వాత నిద్రపోయాడని, అప్పట్లో వార్తలు రాగా ఉదయానికి అతని మరణవార్త అందరినీ కలచివేసింది. ఇది జరిగి ఏడాది గడిచిపోయినా ఇప్పటీ వరకు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ఎవరైనా హత్య చేశారనేది మాత్రం తేలకుండా మిస్టరీగానే మిగిలింది.
వీరిద్దరు కూడా ఎలాంటి సపోర్టు లేకుండానే నటులుగా ఎదిగారు. సొంత టాలెంటుతోనే బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటూ తమకంటూ ఓ గుర్తిపు తెచ్చుకున్నారు. వీరిద్దరు కూడా రోజుకు నాలుగు గంటల పాటు జిమ్ లోనే తమ సమయం గడిపే వారు. అలాగే తమ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే వీరిద్దరూ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఇక వీరిద్దరు చివరి క్షణాల్లో అడ్మిటైన ఆస్పత్రి కూడా కూపర్ ఆసుపత్రినే కావడం గమనార్హం.
దీంతో సిద్ధార్థ్ ది మూమ్మటికీ హత్యనేనని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. కూపర్ ఆస్పత్రిపై విచారణ చేస్తే అసలు నిజాలు బయటికి వస్తాయని అంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ సిద్దార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించారా? లేదా ఇంకేదైనా కారణాలతో మరణించాడనే అనేది స్పష్టం కానుంది. ఏదిఏమైనా బాలీవుడ్లో మిస్టరీ మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండటం ఒకింత ఆందోళనకు గురిచేస్తుంది.