స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “షేర్షా”ను బుధవారం వీక్షించారు. అల్లు అర్జున్ కు సినిమా బాగా నచ్చింది. టీమ్‌లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా. మిస్టర్ మల్హోత్రా కెరీర్ లోనే ఇది ఉత్తమ ప్రదర్శన. కియారా, ఇంకా ఇతర నటీనటులది అద్భుతమైన పర్ఫార్మెన్స్ . సినిమా టెక్నీషియన్స్ అందరికీ మై…
200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కానీ ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు. నిందితుడు కన్హార్ సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుండి కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు మంగళవారం తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో…
సల్మాన్ ఖాన్ ఇప్పుడు టర్కీలో తన గర్ల్ ఫ్రెండ్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బాలీవుడ్లో సింగర్ మారిన ఇయులియా వంతూర్ తాజాగా షేర్ చేసిన వీడియో ఈ రూమర్లకు కారణమైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో టర్కిష్ హోటల్ లో ఉన్నట్లు తెలుపుతూ వీడియోను పంచుకుంది. Read Also : దీన్ని ఎవడు చేసుకుంటాడో…
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ భారీ బడ్జెట్ మూవీ ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’. తాజగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 30 కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యాయని అంటున్నారు. బాలీవుడ్ మీడియా ప్రకారం ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్రాన్ని మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారట. ఈ చిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్…
బాలీవుడ్ గాయకుడు యో యో హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని రోజుల క్రితం ఆయన భార్య షాలిని హనీ సింగ్‌పై ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005’ కింద కేసు దాఖలు చేసింది. అది తాజగా విచారణకు రాగా హనీ సింగ్ కోర్టులో హాజరు కాలేదు. హనీ సింగ్ హాజరు కాకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టు నుంచి మినహాయింపు…
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు అర్మాన్ కోహ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో శనివారం అర్మాన్ ఇంటిపై దాడి చేసింది. ఆనంతరం అతడిని అదుపులోకి తీసుకుంది. గత కొన్ని రోజులుగా ముంబైలో డ్రగ్స్ గురించి ఎన్‌సిబికి సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఎన్‌సిబి ఆపరేషన్ ప్రారంభించి దానికి “రోలింగ్ థండర్” అని పేరు పెట్టింది. ‘రోలింగ్ థండర్’ ఆపరేషన్ కింద అర్మాన్ కోహ్లీ ఇంటిపై దాడి చేశారు. అర్మాన్ ఇంట్లో…
‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఇతర టీవీ షోలలో కన్పించిన నటి, మోడల్ గెహన వశిష్ట ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. గేహన వసిస్త పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ దానికి కారణం ముంబై పోలీసులే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “పోలీసులు నాకు ఈ దుస్థితిని తెచ్చారు. నా బ్యాంక్…
సెలబ్రిటీలు బయటకు వెళ్లినప్పుడు గమనించండి.. ఓ బలిష్టమైన వ్యక్తి వారిని నీడలా అనుసరిస్తుంటాడు. అతడే వారి పర్సనల్ బాడీ గార్డు…అనగా వ్యక్తిగత అంగరక్షకుడు. ఐతే ఈ బాడీగార్డుల జీతం ఎంత ఉంటుందనుకుంటున్నారు.. నెలకో యాబై అరవై వేల వరకు ఉంటుందా? ఇంకా ఎక్కువేనా..?సెలబ్రిటీ బాడీగార్డుల జీతాల గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పెద్ద పెద్ద సర్కార్ కొలువులు చేసేవారికి కూడా అంత ఉండదేమో. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా అంత పెద్ద…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారా ? అనే అనుమానం రాజకీయ వర్గాలతో పాటు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. సోనూసూద్ ఢిల్లీ సీఎంతో భేటీ కావడం ఈ చర్చకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో సోనూసూద్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య సమావేశం జరిగింది. సోనూ సూద్, సిఎం కేజ్రీవాల్ భేటీకి రాజకీయ రంగు అద్దుతున్నారు. ఈ సమావేశాన్ని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.…
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి సమస్యపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆమె వెనుకాడదు. ఆమె ఏం అనుకున్నా కూడా మొహం మీదే కుండబద్దలు కొడుతుంది. తాజాగా ఓ రేప్ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పుపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో…