ట్రాజెడీ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్… ఇలా సినిమాల్లో పలు తెగలు ఉన్నాయి. అయితే అన్నీ కలిపి రెండే రెండుగా విభజించారు. అవే సుఖాంతం, దుఃఖాంతం. బాధతో ముగింపు కనిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే. ఇక సంతోషంగా ముగిసే ఏ చిత్రమైనా హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ చివరలో మరణిస్తే అది ట్రాజెడీయే, హీరో, హీరోయిన్ కలుసుకోక పోయినా దానినీ విషాదాంతం అనే చెప్పాలి. ఇలా సినిమా తొలినుంచీ సాగుతూ, ప్రేక్షకుల ముందు…
2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైనెస్స్’ చక్కని విజయాన్ని సాధించింది. ఓ సూపర్ స్టార్, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ సెన్సిబుల్ పాయింట్ ను నట దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ (జూనియర్ లాల్) హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రంలో…
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు కళల పట్ల మంచి అభిరుచి ఉంది. ఆయన తన అభిమానులు వేసే అద్భుతమైన పెయింటింగ్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల తన అభిమానులలో ఒక ప్రత్యేక వ్యక్తి వేసిన పెయింటింగ్ కు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. యువ అభిమాని కళాత్మక నైపుణ్యాలతో తనను ఆకట్టుకున్నాడు అంటూ ఈ బాలీవుడ్ లెజెండ్ ఆ ఫోటోను షేర్ చేశారు. అందులో ఓ యువకుడు అమితాబ్ నటించిన ‘గులాబో…
పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటుంది నటి టబు. అంత సెలక్టీవ్ గా ఉంటుంది కాబట్టే తక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఒప్పుకుంది టబు. గతంలో మహేశ్ దర్శకత్వం వహించిన ‘అస్థిత్వ’లో లీడ్ రోల్ చేసింది టబు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జాతీయ అవార్డును సాధించింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేశ్, టబు కలసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు…
గత వారం బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మూడు రోజుల దాడుల తరువాత ఐటి శాఖ సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు, అతని ఫౌండేషన్‌కు సంబంధించి 18 కోట్లు విరాళాలు రాగా, అందులో కేవలం రూ.1.9 కోట్లు కోసం ఖర్చు చేశారని ప్రకటించారు. ఈ విషయం ఆయన ఫాలోవర్స్ ను, అభిమానులను షాక్ కు…
ఇటీవల కాలంలో భాషలతో సంబంధం లేకుండా నటీనటులు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా అన్ని భాషల నటీనటులను ఆదరిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఇటీవల “షేర్షా”గా వచ్చి ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా కోలీవుడ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక నెల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘షేర్షా’ విడుదలైంది. కార్గిల్ యుద్ధ హీరో విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ ఆకట్టుకున్నాడు. ‘బిల్లా’ దర్శకుడు విష్ణువర్ధన్…
ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా ‘అటాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న అజయ్ కపూర్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. సుభాష్ కాలేతో కలిసి భారీ స్థాయిలో ‘గార్డ్’ మూవీని నిర్మించబోతున్నాడు. ఆఫ్ఘన్ కాందిశీకుల వేతల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ ప్రకటనతో పాటు నిర్మాతలు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పరమాణు’, ‘రోమియో అక్బర్ వాల్తేర్’, ‘బేబీ’, ‘ఎయిర్ లిఫ్ట్’ తర్వాత ఆ తరహాలోనే ‘అటాక్’, ‘గార్డ్’ చిత్రాలను అజయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక…
మహేశ్ బాబు ‘వన్.. నేనొక్కడినే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ‘రాబ్తా’, ‘బరేలి కి బర్ఫీ’, ‘స్ట్రీ’, ‘లుకా చుప్పి’, ‘కళంక్’, ‘పానిపట్’, ‘హౌస్ ఫుల్4’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ‘మిమి’ సినిమాతో సూపర్ స్టార్ హీరోయిన్ అయింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా కృతి ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తుకు…
బాలీవుడ్ నటికి జీవితంలో మర్చిపోలేని షాకింగ్ ఘటన ఎదురైంది. ఆమెకు గన్ గురి పెట్టి ఏకంగా లక్షల్లో దోపిడీ చేశారట దొంగలు. ఈ షాకింగ్ ఘటన నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… నటి నికితా రావల్ బాలీవుడ్ తో పాటు దక్షిణ భారతీయ సినిమాలలో మంచి ఆర్గనైజర్, పెర్ఫార్మర్గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆమె “మిస్టర్ హాట్ మిస్టర్ కూల్”, “ది హీరో – అభిమన్యు”, “గరం మసాలా”, అక్షయ్ కుమార్, జాన్…