బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి అభిమానులు ఈ జంట పెళ్లి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా సినీ పరిశ్రమలో వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వారు రాజస్థాన్‌లోని ఒక ఐకానిక్ ప్యాలెస్ హోటల్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి సన్నాహాలు మొదలుపెట్టారు. వీరి పెళ్లి తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Also : మెగా అప్డేట్ : “భోళా శంకర్” ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
“బ్రహ్మాస్త్ర” షూటింగ్ తర్వాత ఇద్దరు నటీనటులు తమ డేట్ లను ఖాళీగా ఉంచారు. అంటే ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. అదే వీరి పెళ్లిపై ఊహాగానాలకు కారణమైంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే ‘యానిమల్’ సినిమా షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ డేట్స్ ను నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నారట. మరోవైపు అలియా భట్ కూడా తన సినిమా షూటింగులు ముగించింది.