ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా గురించి బాగా విన్పిస్తోంది. ముఖ్యంగా భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవడం, అది గ్రాంట్ కావడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా సూపర్ స్టార్లుగా పిలవబడే స్టార్స్ కు ఈ వీసా లభిస్తోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్, బి టౌన్ నిర్మాత బోనీ కపూర్ కు గోల్డెన్ వీసా లభించడం విశేషం. మంగళవారం ఆయన ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబానికి 10…
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా చేరాడు. ఇది అతనికి అతని అభిమానులకు బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఎంట్రీ ఇవ్వబోతోంది ఓ అంతర్జాతీయ డిజిటల్ సీరీస్ తో. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోయే ఓ అంతర్జాతీయ సిరీస్ కోసం సైన్ చేశాడు వరుణ్. ఆ సీరీస్…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి టాలెంట్ ను అడ్డుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. ఆ ట్యాలెంట్ రోడ్డుపై ఉన్నా, బస్టాండ్ లో ఉన్నా, రైల్వే స్టేషన్ లో ఉన్నా లేదా మారుమూల గ్రామంలో ఉన్నా కూడా బయటకు రావాల్సిందే. ఇక ఏదైనా వీడియో వైరల్ అయ్యిందంటే దాన్ని మీ ముందుకు రాకుండా ఎవరూ ఆపలేరు. అదీ సోషల్ మీడియా పవర్. Read Also : విజయవాడ దుర్గమ్మను దర్శించిన సోనూసూద్ అయితే గత కొన్నాళ్ల…
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “తలైవి” షూటింగ్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిన్న “తలైవి” కోసం ఢిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కంగనా తన…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ విజయవాడ కనకదుర్గమ్మను వీక్షించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు అంకితమైన సేవతో దేశంలో బాగా పాపులర్ అయిన రియల్ హీరోను స్వాగతించడానికి గన్నవరం విమానాశ్రయానికి అనేక మంది అభిమానులు తరలి వచ్చారు. సోనూసూద్ వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి గురువారం ఇక్కడకు వచ్చారు. యుపిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ, విద్యావేత్తలతో పాటు సేవా కార్యకలాపాలను చేపట్టాలని సోను సూద్ సూచించారు. ప్రజలకు సేవ చేసే అలవాటును…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేస్తున్న మంచి పనులు చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలుసు. కరోనా కష్ట సమయంలో చాలా మందికి తగిన సాయం చేసి తోడుగా నిలిచిన సోనూ సూద్ కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి చలించిపోయారు. చేతిలో తగినంత డబ్బు లేక, పట్టించుకునే నాథుడు లేక అల్లాడిపోతున్న ప్రజలకు తన దాతృత్వ గుణంతో దేవుడయ్యాడు. ఇప్పటికి ఆయన తన సేవను అలాగే…
(సెప్టెంబర్ 9న అక్షయ్ కుమార్ బర్త్ డే)ఇంతింతై వటుడింతై అన్న చందాన అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో పాతకు పోయారు. ఓ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా అల్లుడు అక్షయ్ కుమార్ అని ఇప్పుడు పేరు సంపాదించారు. కానీ, ఏ అండా లేకుండానే రంగుల ప్రపంచంలో అక్షయ్ కుమార్ నిలదొక్కుకోవడం విశేషమనే చెప్పాలి. పైగా కొందరు ప్రముఖుల వారసుల ఆధిపత్యం ముందు అక్షయ్ నిలవడని కొందరు భావించారు. అలాంటి వారు నేడు నోళ్లు వెళ్ళ బెట్టుకొనేలా…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై ఓ కంపెనీ గేమ్ ను రూపొందించి వదిలింది. దీనికి యూజర్స్ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. కానీ అది సల్మాన్ ను మాత్రం కలవర పెట్టింది. తన పేరు మీద గేమ్ సృష్టించడం, అది కూడా పాపులర్ అవుతుండడం సల్మాన్ కు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది ? అనే డౌట్ రావొచ్చు. కానీ ఆ గేమ్ సల్మాన్ ను కంగారు పెట్టేసింది మరి. విషయం ఏమిటంటే… సల్మాన్…
ఎప్పటినుంచో వినిపిస్తున్న షారూఖ్, అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇటీవల ఈ సినిమా పూణేలో ప్రారంభమైంది. ప్రస్తుతం సినిమా ప్రధాన తారాగణం పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పని చేయబోతున్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలు కంపోజ్ చేస్తుండగా, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయబోతున్నట్లు టాక్. ఇంతకు ముందు రెహమాన్, అట్లీ కలసి ‘మెర్సల్, బిగిల్’ సినిమాలకు పని చేశారు.…
బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తల్లి నేడు తుది శ్వాస విడిచారు. తల్లి అనారోగ్యం బారిన పడిందని తెలియడంతో సెప్టెంబర్ 6న లండన్ నుంచి ఇండియా చేరుకున్నారు అక్షయ్ కుమార్. ఆయన తన నెక్స్ట్ మూవీ షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లారు. అక్షయ్ తల్లి శ్రీమతి అరుణ భాటియా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.…