అన్నాచెల్లెళ్ళ అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న సినిమా ‘రక్షాబంధన్’. అక్షయ్ కుమార్, భూమీ ఫడ్నేకర్ జంటగా ఈ సినిమా ఆనంద్ ఎల్. రాయ్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. హిమాన్షు శర్మ, కనికా థిల్లాన్ సహ రచయితలుగా వ్యవహరిస్తున్న ‘రక్షాబంధన్’ను తన సోదరి హీరానందాని కి డెడికేట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు. ఇందులో సహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2020 ఆగస్ట్ 3 రక్షాబంధన్ సందర్భంగా…
అక్టోబర్ 22వ తేదీ నుండి మహారాష్ట్రలోనూ సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్ ను తెరవబోతున్నారు. అయితే సినిమా థియేటర్లు, ఆడిటోయంలలో కేవలం సిట్టింగ్ కెపాసిటీలో యాభై శాతానికి మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మంగళ వారం మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 2020 మార్చిలో సినిమా థియేటర్లను కరోనా కారణంగా మూసివేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాలలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో థియేటర్లను పాక్షికంగా తెరిచారు. కానీ కరోనా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్న సన్నీ సింగ్ నిన్న పుట్టినరోజును జరుపుకున్నారు. సన్నీ సింగ్ తన పుట్టిన రోజును ‘ఆదిపురుష్’ టీం సెట్స్ లో ఘనంగా సెలెబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో ప్రభాస్ సన్నీ సింగ్కు కేక్ తినిపించడం కనిపిస్తుంది. Read Also : ఆ స్టార్ కోసం “పుష్ప”రాజ్ వెనకడుగు ‘తన్హాజీ’…
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు ఆర్యన్ ఖాన్ను ఎన్సిబి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం రాత్రి గోవా వెళ్లే క్రూయిజ్ లైనర్లో జరిగిన పార్టీలో దాడి చేసి 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసింది.…
ఇటీవల ముంబైలో షిప్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఇప్పటికీ ఎన్సిబి అధికారుల అదుపులోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆదివారం షారూఖ్ని కలసి పరామర్శించారు. షారుఖ్ ఇంట్లో సల్మాన్ దాదాపు గంట టైమ్ స్పెండ్ చేశాడు. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి షారూఖ్ ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్, షారూఖ్ మంచి…
ట్రాజెడీ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్… ఇలా సినిమాల్లో పలు తెగలు ఉన్నాయి. అయితే అన్నీ కలిపి రెండే రెండుగా విభజించారు. అవే సుఖాంతం, దుఃఖాంతం. బాధతో ముగింపు కనిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే. ఇక సంతోషంగా ముగిసే ఏ చిత్రమైనా హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ చివరలో మరణిస్తే అది ట్రాజెడీయే, హీరో, హీరోయిన్ కలుసుకోక పోయినా దానినీ విషాదాంతం అనే చెప్పాలి. ఇలా సినిమా తొలినుంచీ సాగుతూ, ప్రేక్షకుల ముందు…
2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైనెస్స్’ చక్కని విజయాన్ని సాధించింది. ఓ సూపర్ స్టార్, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ సెన్సిబుల్ పాయింట్ ను నట దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ (జూనియర్ లాల్) హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రంలో…
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు కళల పట్ల మంచి అభిరుచి ఉంది. ఆయన తన అభిమానులు వేసే అద్భుతమైన పెయింటింగ్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల తన అభిమానులలో ఒక ప్రత్యేక వ్యక్తి వేసిన పెయింటింగ్ కు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. యువ అభిమాని కళాత్మక నైపుణ్యాలతో తనను ఆకట్టుకున్నాడు అంటూ ఈ బాలీవుడ్ లెజెండ్ ఆ ఫోటోను షేర్ చేశారు. అందులో ఓ యువకుడు అమితాబ్ నటించిన ‘గులాబో…
పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటుంది నటి టబు. అంత సెలక్టీవ్ గా ఉంటుంది కాబట్టే తక్కువ సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో సినిమా చేయటానికి ఒప్పుకుంది టబు. గతంలో మహేశ్ దర్శకత్వం వహించిన ‘అస్థిత్వ’లో లీడ్ రోల్ చేసింది టబు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా జాతీయ అవార్డును సాధించింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహేశ్, టబు కలసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు…