అసురన్ ఫేమ్ మాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ మంజూ వారియర్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. కల్పేష్ డైరెక్ట్ చేస్తున్న అమిక్రి పండిట్ మూవీలో హిరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రి కరణ చివరి దశలో ఉంది. 1999లో మళయాళ చిత్రా లకు గుడ్‌బై చెప్పిన ఆమె 15 ఏళ్ల తర్వాత హౌ ఓల్డ్ ఆర్‌యూతో రీ ఎంట్రీ ఇచ్చిం ది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంలో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
కాగా, ఆమె తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరం గేట్రం చేసింది. ఆమె నటించిన సల్లాపం, ఏ పళయుం కదన్ను, తూవల్ కొట్టరం, కలియట్టం, కృష్ణగుదియిల్ ఒరు ప్రనయ కలదు (1997), దయ, ప్రణయవర్ణంగళ్, సమ్మర్ ఇన్ బెత్లెహెం, కన్మదం (1998), పత్రం(1999), ది ప్రీస్ట్. ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభిం చింది. ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది.