కన్నడ సినిమాతో రష్మికా కెరీర్ మొదలయింది. తర్వాత తెలుగులోను సత్తా చాటింది. తమిళంలో పర్లేదు మరీ హిందీ సంగతి ఏంటీ.. బాలీ వుడ్‌లో ఈ అమ్మడికి విజయం వరించేనా .. హిందీలో సినిమా చేయక ముందు రష్మికా మందన్నాకు ఉత్తరాదినా బోలెడు క్రేజ్ వచ్చేసింది. కొందరైతే ఏకంగా నేషనల్ క్రష్ అని ఆకాశానికి ఎత్తేశారు ఈ భామను. బాలీవుడ్‌లో సక్సెస్ పుల్ హీరోయిన్‌గా తనను తాను నిరూ పించుకోవడానికి తీవ్ర ప్రయత్నమే చేస్తుంది. హిందీలో రష్మికా నటించిన మిషన్ మజ్ను సినిమా మే13, 2022న విడుదల అవ్వనుంది. ఈ రోజు కోసం ఈ భామ ఎదురు చూస్తోంది. మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా హిరో . అతనికి జోడిగా రష్మికా జోడిగా కనిపించనుంది.
వీళ్లిద్దరి జోడికి ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది. హిందీలో ఇప్పటికే ఈ అమ్మడు రెండో సినిమాను మొదలెట్టేసింది. అమితా బ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్‌బై సినిమాలో అమితాబ్‌తో కలిసి ఈ భామ నటించనుంది. చేతిలో ఓ సినిమా ఉన్న కూడా ఫస్ట్ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్‌లో పాగా వేయాలని ఈ భామ నిర్ణయిం చుకుంది. ఇప్పటికే హిందీ సినిమాల ముంబైలో రష్మిక ఓ ప్లాట్‌ను సైతం తీసుకున్నారు. హిందీ సినిమాలు చేసేటప్పుడు హోటల్స్‌లో ఉండటం కష్టంగా ఉందని ఏకంగా ఇల్లు కూడా కొన్నది ఈ అమ్మడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతలా సక్సెస్ అవుతనాని ఈ భామ ఇప్పుడే డిసైడ్ చేసుకుంది మరీ.